ప్రపంచ వ్యాప్తంగా ఆది పురుష్ మేనియా నడుస్తుంది. శుక్రవారం నుండి థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కటౌట్లు కట్టి.. గజమాలలతో హడావుడి చేస్తున్నారు. బాణా సంచాలు పేల్చి హంగామా చేస్తున్నారు. ఏ థియేటర్ వద్ద చూసిన అభిమాన కోలాహలం నెలకొంది
ప్రపంచ వ్యాప్తంగా ఆది పురుష్ మేనియా నడుస్తుంది. శుక్రవారం నుండి థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద భారీ కటౌట్లు కట్టి.. గజమాలలు వేసి హడావుడి చేస్తున్నారు. బాణా సంచాలు పేల్చి హంగామా చేస్తూ.. జై శ్రీరామ్ అంటూ పెద్ద యెత్తున నినదిస్తున్నారు. ఏ థియేటర్ వద్ద చూసిన అభిమాన కోలాహలం నెలకొంది. ప్రభాస్‌ను తొలి సారిగా ఓ పురాతన ఇతిహాస గాధ పాత్ర చేస్తుండగా.. అందులోనూ అందరి ఆరాధ్య దైవం రాముడి పాత్రలో కనిపించనుండటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు ఫ్యాన్స్. ఇక సందట్లో సడేమియాలాగా సినిమాను చూసి రివ్యూ చెప్పేవాళ్ల హడావుడి అంతా ఇంతా కాదు. ముందు తామే రివ్యూస్ చెప్పి.. మీడియా కంట్లో పడి.. హైప్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఆదిపురుష్ సినిమా చూసి వచ్చి రివ్యూ ఇచ్చినందుకు ఓ వ్యక్తిని చితకొట్టేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో సినిమా చూసి బయటకు వచ్చిన వ్యక్తిని అక్కడ మీడియా సినిమా ఎలా ఉందని ప్రశ్నించగా.. తనకు నచ్చలేదని చెప్పాడు. తనకు చిన్న పిల్లల గేమ్ చూస్తున్నట్లు ఉందని, ప్రభాస్ రాముడిగా అస్సలు సెట్ కాలేదంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడ ఉన్నా ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయ్యారు. రివ్యూ చెప్పద్దంటూ గొడవకు దిగారు. నువ్వుడివా రివ్యూ చెప్పేందుకు అంటూ బండ బూతులు తిట్టారు. అంతేకాదూ.. అతడిని ఉతికి ఆరేశారు. పిచ్చ కొట్టుడు కొట్టారు. తర్వాత అక్కడ ఉన్న వారు ఆపితే.. ఫ్యాన్స్ ఆగారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.