బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు హీరో ప్రభాస్. ప్రస్తుతం డార్లింగ్ ఏ సినిమా చేసినా అది దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో, అన్ని ప్రాంతాల్లో విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం మరో ఆరు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్ర బృందం ఇప్పుడు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ప్రధాన తారాగణం ప్రభాస్, పూజా హెగ్డే ఇంటర్వ్యూలలో నిమగ్నమై ఉన్నారు.
ఇది కూడా చదవండి : పూజాహెగ్డేతో లిప్ లాక్ సీన్ ఇబ్బంది పెట్టింది: ప్రభాస్
అయితే తాజాగా ‘రాధే శ్యామ్’ టీమ్.. సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇటలీలో 1970ల నాటి నేపథ్యంలో కొనసాగే కథతో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ. ఈ మేకింగ్ వీడియోలో మహమ్మారి వ్యాప్తికి ముందు వరకు ఇటలీలో షూటింగ్ కి ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగినట్టు వెల్లడించారు. సినిమాని ఇటలీలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. మేకింగ్ వీడియోలో ఇటలీలోని అందమైన ప్రకృతి దృశ్యాలు, ఐకానిక్ స్పాట్ లు కన్పిస్తున్నాయి. షూటింగ్ కోసం చాపర్లను కూడా ఉపయోగించారు.
ఇది కూడా చదవండి : వీడియో: రిపోర్టర్ కి షాకిచ్చిన ప్రభాస్! నవ్వుతూనే కౌంటర్!

కానీ కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో షూటింగ్ లు చేసే పరిస్థితి లేకపోవడంతో.. ‘రాధే శ్యామ్’ బృందం భారతదేశంలో యూరప్‌ను పునర్నిర్మించాలని నిర్ణయించుకుంది. షూటింగ్ కోసం భారీ సెట్లను ఏర్పాటు చేశారు. అందులోనే సినిమాలో కీలకమైన షిప్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. జస్టిన్ ప్రభాకరన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత అత్యుత్తమ సంగీతకారులతో ట్యూన్లను కంపోజ్ చేశారు. వీడియో చూస్తే.. సినిమా కోసం టీం ఎంత కష్టపడ్డారో స్పష్టంగా అర్థం అవుతుంది. యూట్యూబ్‌లో విడుదల చేసిన వీడియో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
