ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక ఉంటుంది. అలాంటి వాటిల్లో సొంతిల్లు ఉండాలనేది చాలా మంది కల. తమ అభిరుచికి తగినట్లు ఇల్లు కట్టుకోవాలని చాలామంది కలలు కంటారు. అందుకు, సెలబ్రిటీలు అతీతం ఏమీ కాదు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కి ఉన్న ఆ సొంతింటి కల నెరవేరింది. పూజా తనకు నచ్చినట్లుగా ఓ ఇంటిని ముంబైలో కట్టించుకుంది. శుక్రవారం నాడు ఆ ఇంట్లో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సినీ సెలబ్రిటీలు, ఆమె అభిమానులు పూజాకి అభినందలను తెలియజేస్తున్నారు.
ఇక తాను పూజలో పాల్గొన్న ఫోటోని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా, అది వైరల్ అవుతుంది. ట్రెడిషనల్ లుక్ లో పూజా అందరిని ఆకట్టుకుంటుంది. “నా కలలన్నీ నెరవేర్చినందుకు ఏడాదికి కృతజ్ఞతతో ఉంటున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడి పని చేయండి. నిజంగా ఈ ప్రపంచం మీతో ప్రేమలో పడుతుంది” అని పూజా హెగ్డే ఇన్ స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఈ ఇంటి పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
మరోవైపు రిలాక్స్ కోసం ఇటీవల మాల్దీవులకు వెళ్లిన పూజా హెగ్డే.. రెట్టింపు ఎనర్జీని పొందింది. అయితే సముద్రంలో జలకాలాడుతూ బికినీలో ఆమె ఫోటోలకు పోజులిస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు నెటిజన్లని కట్టిపడేశాయి. బికినీలో తన అసలైన అందాలను చూపిస్తూ పూజా రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ఇక టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్ గా రాణిస్తుంది.
ఇది చదవండి : క్యాన్సర్ చికిత్స పొందుతూ ఫోటోషూట్ చేసిన స్టార్ హీరోయిన్!
ప్రస్తుతం ప్రభాస్ తో నటించిన రాధేశ్యామ్ విడుదలకు రెడీగా ఉంది. అలాగే రామ్ చరణ్ కు జోడీగా ‘ఆచార్య’ సినిమాలో కనిపించనుంది. తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’, హిందీలో రణ్ వీర్ సింగ్ కు జోడీగా ‘సర్కస్’ సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే. ఆ రెండూ సెట్స్ మీద ఉన్నాయి. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సినిమాలో కూడా ఈ బుట్ట బొమ్మనే హీరోయిన్ అని సమాచారం. తన కలనెరవేరిందని పూజా పెట్టిన ఎమోషనల్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.