హరిహర వీరమల్లు.. పవన్ కల్యాణ్– క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న పిరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇలాంటి ఒక పాత్రలో పవన్ ఇప్పటివరకు నటించకపోవడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. క్రిష్ రచించి.. తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, కొన్ని రోజులుగా షూట్ కి బ్రేక్ పడటంతో సినిమా అనుకున్న సమయానికి రాదేమో అని అభిమానుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. కానీ, అలాంటి అవకాశమే లేదని చిత్ర బృందం క్లారిటీ ఇస్తోంది.
ఇప్పటికే తర్వాతి షెడ్యూల్‌కు సంబంధించిన ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కూడా నిర్వహించారు. అక్టోబరు 15 తర్వాత తర్వాతి షెడ్యూల్ ప్రారంభిస్తామని అతి త్వరలో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ప్రీ షెడ్యూల్ వర్క్ షాప్‌లో పవన్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రెడ్ టీషర్ట్, జీన్స్, షూస్ వేసుకుని అక్కడ అటూ ఇటూ తిరుగుతూ స్టోరీ డిస్కషన్ చేస్తున్న పవన్ ని చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు పవన్ పెట్టుకున్న వాచ్, వేసుకున్న షూస్‌పై నెట్టింట ఓ పంచాయితీ నడుస్తోంది. వాచ్ రూ.14 లక్షలని, షూస్ రూ.10 లక్షలు అంటూ కొందరు ట్రోల్ చేయడం, కొందరు డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అసలు వాటి ధర ఎంతో చూద్దాం.
పవన్ కల్యాణ్ పెట్టుకున్న వాచ్ ఇటలీ సంస్థ అయిన పనేరాయ్ కంపెనీకి చెందింది. పనేరాయ్ లోని సబ్ మెర్సిబుల్ కార్బోటెక్ 47ఎంఎం అనే మోడల్ వాచ్ అనమాట. దాని ధర అక్షరాలా రూ.14,37,000 అనమాట. అయితే వాచ్ ధర విషయంలో ఎలాంటి కన్ఫూజన్ లేకపోయినా కూడా.. పవన్ వేసుకున్న షూస్ విషయంలో మాత్రం పెద్దఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. వాటి ధర రూ.10 లక్షలు అంటూ చెప్పుకుంటున్నారు. కొందరు వాటి ధర అంతా అంటూ ట్రోల్ చేస్తున్నారు. నిజానికి పవన్ వేసుకున్న షూస్ ధర విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ షూస్ ధర దాదాపు రూ.9,600 ఉంటాయి. అవి కోపెన్ హాగెన్ అనే కంపెనీకి చెందినవి. ఆన్ లైన్ లో వాటి ధర 119,94 యూరోస్ అని చూపిస్తోంది. అంటే 11,994 యూరోస్ అని అనుకుంటున్నారు. నిజానికి మనం ‘.’ పెట్టిన స్థానంలో యూరోస్‌లో ‘,’ కామాని పెడతారు. అంటే ఆ షూస్ ధర 119.94 యూరోస్ అనమాట. అంటే మన కరెన్సీ దాదాపు రూ.9,600 అవుతుంది. అదనమాట పవన్ పెట్టుకున్న వాచ్, షూస్ మీద జరుగుతున్న చర్చ, రచ్చ, ట్రోలింగ్‌లో ఉన్న నిజాలు, ప్రచారాలు.