భోళా శంకర్ సినిమాలో పవన్ ప్రస్తావన ఉంటుందని ముందే తెలుసు. కానీ జైలర్ లో కూడా పవన్ ప్రస్తావన ఉంది. అది కూడా కేవలం తెలుగులోనే కాదు.. మిగతా భాషల్లో కూడా.
రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా జైలర్. తాజాగా రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్.. కుర్రహీరోల కంటే యమ ఫాస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. ఎప్పుడూ లేనంతగా.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అయితే రజనీకాంత్ కు సాలిడ్ హిట్ పడి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో వచ్చిన శివాజీ, రోబో ఇవి తప్పితే తలైవా ఖాతాలో సరైన హిట్ పడలేదు. చేస్తున్న సినిమాలు కలెక్షన్స్ అయితే వసూలు చేస్తున్నాయి కానీ అవి రజిని రేంజ్ కు సరిపోవడం లేదు. ఇప్పుడంటే చాలామంది హీరోలు పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ రజనీకాంత్ మాత్రం ఈ ఫేమ్ ఎప్పుడో చూసేశారు.
దాన్ని కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే జైలర్ సినిమా చేశారు. రిలీజ్ అయిన అన్ని చోట్ల మంచి టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ పవన్ కళ్యాణ్ గురించి ఉండడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా.. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. రజినీకాంత్ కి సాలిడ్ హిట్ పడితే ఎలా ఉంటుందో జైలర్ తో రుచి చూపించారు. రజినీ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఈ ఫీవర్ ఇప్పట్లో తగ్గేలా లేదు. అయితే జైలర్ సినిమాలో సెకండ్ హాఫ్ లో సునీల్, తమన్నా ట్రాక్ మొదలవుతుంది. ఈ ఇద్దరినీ పెట్టి మూవీ తీసే డైరెక్టర్‌గా కమెడియన్ సునీల్ రెడ్డి నటించారు.
ఈయన వరుణ్ డాక్టర్, బీస్ట్ సినిమాల్లో నటించారు. అయితే సునీల్ రెడ్డి క్యారెక్టర్ కి విగ్ ఉంటుంది. దాన్ని ఉద్దేశించి సునీల్ ఒక డైలాగ్ వేస్తాడు. ‘పవన్ కళ్యాణ్ లాగా ఆ హెయిర్ స్టైల్ ఏంటి’ అంటూ డైలాగ్ చెప్పగానే థియేటర్ లో అరుపులు, విజిల్స్ పడ్డాయి. అయితే తెలుగు వెర్షన్ లో మాత్రమే కాదు.. అన్ని భాషల్లోనూ పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఉంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇతర భాషల్లో కూడా పవన్ పేరు ఎత్తగానే విజిల్స్ పడుతున్నాయి. దీంతో పవన్ క్రేజ్ ఏ పాటిదో అర్థమవుతుంది. ఇక ఇవాళ విడుదలైన భోళా శంకర్ సినిమాలోనూ పవన్ మ్యానియా కనబడుతుంది. ఈ మూవీలో కొన్ని సీన్స్ లో పవన్ క్యారెక్టర్ ని చిరు ఇమిటేట్ చేయడం.. ఖుషీ నడుము సీన్ వంటివి చూసి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. భోళా శంకర్, జైలర్.. ఈ రెండు సినిమాల్లోనూ పవన్ ప్రస్తావన ఉండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.