ఒకప్పటి అందాల తార లయ గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఒకరోజు లయ పవన్ కళ్యాణ్ నుంచి ఒక మాట తీసుకున్నారు. ఆయన మాట ఇచ్చారు. ఈయన అంటారు గానీ మాట మీద నిలబడతారా అని నటి లయ అనుకున్నారట. కానీ ఊహించని విధంగా పవన్ ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఇంతకే ఏంటా మాట? పవన్ ని లయ ఏమడిగారు? పవన్ ఏమన్నారు?
మామూలుగా చిన్న ఉద్యోగాలు చేసుకుని బతికే సామాన్యులే ఎవరైనా బంధువులు, స్నేహితులు ఏదైనా పెళ్లి వేడుకకు గానీ, ఫంక్షన్ కి గానీ పిలిస్తే ఖాళీ లేదని వెళ్లడం మానేస్తుంటారు. ఫోన్ లో వస్తామని చెప్పినా.. లోపల మనసులో మాత్రం వెళ్లడం అవసరమా, మనం వెళ్లకపోతే పెళ్లి ఆగిపోద్దా అని ఆలోచిస్తుంటారు. అలాంటిది ఎప్పుడూ బిజీగా ఉండే గొప్ప వాళ్ళు ఎలా ఆలోచించాలి. వాళ్ళకి పెళ్ళికి వెళ్ళాలి అని ఆలోచించేంత సమయం కూడా ఉండదు. కానీ కొంతమంది గొప్పోళ్ళు ఉంటారు. ఎదుటివారికి విలువ ఇస్తారు. అలాంటి వారు కేవలం పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్ లకే కాదు, పిలిస్తే అభిమానుల ఫంక్షన్లకు వెళ్తారు, చిన్న చిన్న ఆర్టిస్టుల ఫంక్షన్లకు వెళ్తారు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు.
పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇప్పుడూ, అప్పుడూ, ఎప్పుడూ తగ్గదనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ డేట్స్ నిర్మాతలకి దొరకడమే గగనం. అలాంటిది ఆయన వ్యక్తిగత సమయాన్ని వ్యక్తుల కోసం కేటాయించడం అనేది చాలా రేర్. పవన్ ఎవరి ఫంక్షన్స్ కైనా వెళ్లడం అనేది చాలా తక్కువ. వెళ్తే మాత్రం వెళ్లిన విషయం ఆ ఫంక్షన్ తాలూకు మనుషులు చెప్తేనే గానీ తెలియదు. తాజాగా లయ పవన్ కళ్యాణ్ తన పెళ్లికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు. తాను పవన్ కళ్యాణ్ తో నటించలేదని.. కానీ తన పెళ్ళికి ఆయన్ని ఇన్వైట్ చేస్తే వచ్చారని అన్నారు. అసలు ఆయనతో యాక్ట్ చేయలేదు. ఆయనకు రావాల్సిన అవసరం కూడా లేదు. కానీ వస్తానని ఇచ్చిన మాట కోసం ఆయన వచ్చారని గుర్తు చేసుకున్నారు.
లయ 2006లో డాక్టర్ శ్రీ గణేష్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన పెళ్లి పెళ్లికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ని పిలుద్దామని వెళ్లారట. చిరంజీవిని పిలిస్తే ఆయన వస్తానని అన్నారట. లయ కూడా చిరంజీవి వస్తారని ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే చిరంజీవి గతంలో లయ చేసిన డ్యాన్స్ ప్రోగ్రాములకి గానీ, సినీ అరంగేట్రం అప్పుడు గానీ చిరంజీవి వచ్చారు. పైగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్ద కాబట్టి పిలిస్తే వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ తో ఎలాంటి పరిచయం లేదు. ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేదు. నేనెవరో తెలియదు. ఆయనకి నా పేరు తెలిసి ఉండచ్చు. కానీ నేను పిలవడానికి వెళ్లాను. అపాయింట్మెంట్ లేదు. వెళ్ళాను. ఆయన వెంటనే రమ్మన్నారు. చాలా సేపు మాట్లాడారు. ఇన్విటేషన్ తీసుకున్నారు. రండి అని అన్నాను. తప్పకుండా వస్తాను అని అన్నారు.
అలానే అంటారు, రారు అనుకున్నా. కానీ అందరి కంటే ముందు, గెస్టుల కంటే ముందు పవన్ కళ్యాణ్ వచ్చారు. చాలా సింపుల్ గా, ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా వచ్చారని, వస్తున్నారన్న సమాచారం కూడా ఇవ్వలేదని అన్నారు. ఆయన్ని బాగా రిసీవ్ చేసుకుని ఏర్పాట్లు చేయడానికి కూడా ఆయన అవకాశం ఇవ్వలేదని, సడన్ గా వచ్చేసారని అన్నారు. ‘అన్నయ్యని పిలిచావు కదమ్మా.. అన్నయ కూడా వస్తున్నారు. ఆన్ ద వే ఉన్నారు. వస్తున్నారు’ అని పవన్ కళ్యాణ్ అన్నారని ఆమె గుర్తు చేశారు. ‘థాంక్యూ సో మచ్ సార్.. భోజనం చేసి వెళ్ళండి’ అని లయ అంటే.. ఆయన నవ్వి భోజనం చేయాలమ్మ, తర్వాత చూద్దాం అంటూ నవ్వుకుని వెళ్లిపోయారని లయ అన్నారు.
అందరూ వచ్చాక వస్తే ఆ సమయంలో క్రౌడ్ వచ్చి పెళ్లి వేడుకకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకే ముందుగా వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ని చూడగానే మండపంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన దగ్గర మూగిపోయారు అని లయ అన్నారు. పవన్ కి రావాల్సిన అవసరం లేదు. వస్తారని కూడా అనుకోలేదు. కానీ ఆయన వచ్చారని.. తన జీవితంలో ఎంతో విలువైన క్షణాలు అని ఆమె అన్నారు. ఇంకా ఆమె ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా అనే ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఆ ఇంటర్వ్యూ కింద ఉంది చూడగలరు. మరి లయ పెళ్లి వేడుకకు పవన్ కళ్యాణ్ వెళ్లడం పట్ల మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.