మనలో మనం కులం, ప్రాంతం, భాషా ప్రతిపాదికల మీద ఎంత కొట్టుకున్నా.. దేశం అనే ప్రస్తావన వస్తే చాలు.. మనమంతా భారతీయులం.. మనమంతా ఒక్కటే అనే ఐక్యతా భావం ప్రతి ఒక్కరిలో దానికదే పుట్టుకొస్తుంది. తాజాగా ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఇదే సన్నివేశం కనిపించింది. ఆ వివరాలు..
భారతీయులు మరీ ముఖ్యంగా తెలుగు వారు ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డు కల నెరవేరింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ఈ సారి రెండు భారతీయ సినిమాలు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాయి. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో.. ఈ అవార్డు సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం. ఈ సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం వెనక దర్శకుడు రాజమౌళి కృషి ఎంతో ఉంది. పట్టువదలని విక్రమార్కుడిలాగా.. ఎంతో శ్రమించి.. చివరకు అవార్డుతో తిరిగి వచ్చారు జక్కన్న. ఆస్కార్‌తో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. నాటు నాటు ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం పట్ల టాలీవుడ్ మాత్రమే కాక అన్ని ఇండస్ట్రీ వాళ్లు గర్వంగా ఫీలవుతున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిందనే ప్రకటన వినగానే నటి దీపికా పదుకోన్ సంతోషంతో కన్నీరు పెట్టుకుంది. ఆ విరాలు..
దీపికా పదుకోన్ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో సందడి చేశారు. దీపికాకు ఆస్కార్ అవార్డు ప్రజెంటర్‌గా ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. అవార్డు కార్యక్రమంలో దీపికా ఒక అవార్డును ప్రకటించారు. బిగ్గెస్ట్ గ్లోబల్ ఈవెంట్‌లో దీపికా దేశీ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చి.. బ్లాక్ అవుట్ ఫిట్‌లో అందంగా మెరిశారు. ఇక నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరలో ఆస్కార్ అవార్డు అందుకుంది అనే ప్రకటన వినగానే దీపికా పదుకోన్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యారు.
ఆ నిమిషం ఆమెకు బాలీవుడ్, టాలీవుడ్ అనే విషయాలు గుర్తుకు రాలేదు. కేవలం భారతీయ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఒక భారతీయ సినిమా నటిగా.. సగటు భారతీయురాలిగా దీపికా ఆ ప్రకటన వినగానే ఆనందంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యింది. సంతోషంతో కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనమంతా భారతీయులం అనే ఐక్యతను చాటారు మేడం.. సూవర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయిన నాటు నాటు పాట అవార్డు గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్, చిరంజీవి వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇది ఆరంభం మాత్రమే అంటూ ట్వీట్ చేశాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Deepika Padukone at the #Oscars when Naatu Naatu won for Best Original Song #DeepikaAtOscars pic.twitter.com/wwyOHEOtiM
— Team DP Malaysia (@TeamDeepikaMY_) March 13, 2023