Most Popular Male Stars Telugu: ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ ‘ఓరమాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ సినీ సర్వే ఫలితాలు వచ్చేశాయి. మే నెలకు సంబంధించి మోస్ట్ పాపులర్ టాప్ 10 తెలుగు హీరోల జాబితాను ఓరమాక్స్ విడుదల చేసింది. ఈసారి జాబితాలో తెలుగులో అత్యంత ఆధరణ ఉన్న స్టార్ హీరోగా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో మహేష్ బాబు, మూడో స్థానంలో జూ.ఎన్టీఆర్, నాలుగో స్థానంలో అల్లు అర్జున్, ఐదో స్థానంలో రామ్ చరణ్, ఆరో స్థానంలో పవన్ కల్యాణ్ నిలిచారు. మిగిలిన స్థానాల్లో వరుసగా నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవి తేజ ఉన్నారు. ఏప్రిల్ నెలలో ప్రభాస్ స్థానంలో జూ. ఎన్టీఆర్ ఉన్నారు. ఈ సారి రెండు స్థానాలు కిందకు దిగారాయన. గత నెలలో మూడో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ఈ సారి నాలుగో స్థానానికి పడిపోయారు.
కాగా, ఓరమాక్స్ మీడియా 2010నుంచి ‘ఓరమాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ పేరిట ప్రతి నెలా సినీ సర్వే నిర్వహించి వాటి ఫలితాలను విడుదల చేస్తోంది. మొదటి ఎనిమిది సంవత్సరాలు కేవలం హిందీకి సంబంధించిన సర్వేలు మాత్రమే నిర్వహించింది. 2019నుంచి హాలీవుడ్, తెలుగు, తమిళంలో.. ఆ తర్వాత 2021నుంచి కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సర్వేలు నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 400 సిటీలు, పట్టణాల్లో ఈ సర్వేలు నిర్వహిస్తుంది. ఈ సర్వేలో భాగంగా.. తరచుగా సినిమాలకు వెళ్లే వారిని వాళ్లకు ఇష్టమైన హీరోలు ఎవరో అడిగి తెలుసుకుంటుంది. వారి సమాధానాల ఆధారంగా ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తుంది. మరి, ‘ఓరమాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్’ మే నెల ఫలితాలపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Anupama: ఆ తప్పుడు పని చేసే వారంటే నాకు అసహ్యం: హీరోయిన్ అనుపమ!
Bahubali STAR #Prabhas is the most popular male star in Telugu, #Ormax May 2022 List.#MaheshBabu is on 2nd, #JrNTR is on 3rd position.#AlluArjun & #RamCharan comes on 4th & 5th positions respectively.#May2022 pic.twitter.com/gF4Nr4JVB1
— Ashwani kumar (@BorntobeAshwani) June 15, 2022