ఏం మాయ చేసిందో గానీ ఇంకా ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆర్మాక్స్ మీడియా ర్యాంకింగ్‌లో టాప్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. సమంత సరసన ఇంకా కొందరు తెలుగు నటీమణులు కూడా ఉండటం విశేషం. టాప్ 10లో ఎవరెవరున్నారో తెలుసుకుందాం.
చలనచిత్ర రంగానికి సంబంధించి ఆర్మాక్స్ మీడియాకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ రంగంలో టాప్ 10లో ఎవరున్నారనేది ప్రతి నెలా జాబితా విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఆర్మాక్స్ మీడియా నుంచి 2025 జూలై మోస్ట్ పాపులర్ నటీమణుల జాబితా రిలీజ్ అయింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..సమంత హవా నడిపింది. టాలీవుడ్ నటి సమంత జాబితాలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా క్రేజ్ మాత్రం తగ్గలేదని నిరూపించింది. అందుకే ఏం మాయ చేసిందో అంటున్నారంతా.
ఇక రెండో స్థానంలో బాలీవుడ్ నటి ఆర్ఆర్ఆర్ హీరోయిన్ ఆలియా భట్ ఉంది. మరో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇక టాలీవుడ్ మేటి నటి కాజోల్ అగర్వాల్ నాలుగో స్థానంలో ఉంది. టాలీవుడ్ అండ్ కోలీవుడ్ నటిగా రాణిస్తున్న త్రిష కృష్ణన్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక అందాల తార నయనతార ఈ జాబితాలో ఆరో స్థానం దక్కించుకుంది.
ఇక తనదైన డ్యాన్స్ శైలితో ప్రేక్షకుల్ని కట్టిపడేసే నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏడో స్థానంలో నిలవగా, పుష్ప 1,2 సినిమాలతో నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్న 8వ స్థానంలో ఉంది. ఇక మరో ముద్దుగుమ్మ శ్రీలీల ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో 9వ స్థానంలో ఉంది. ఇక టాలీవుడ్ మరో మేటి నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పదో స్థానంలో నిలిచింది. ఆర్మాక్స్ టాప్ 10 జాబితాలో ఆలియా భట్, దీపికా పదుకోన్ తప్పించి మిగిలిన 8 మంది తెలుగు సినిమాల్లో రాణిస్తున్నవారే కావడం గమనార్హం.