ట్రిపుల్ ఆర్.. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలగా నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కతున్న ఈ భారీ మల్టీ స్టారర్ రిలీజ్ కి సిద్ధమయ్యే కొద్దీ ఫ్యాన్స్ తొందర ఇంకా ఎక్కువ అయిపోతుంది.
నిజానికి ఎన్నో అంచనాల మధ్య మొదలైన ట్రిపుల్ ఆర్ షూటింగ్ కి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. కరోనా కారణంగా ఎన్నోసార్లు ఈ మూవీ షూట్ ఆగిపోయింది. ఇక హీరోలకి గాయాలయ్యి ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ.., ట్రిపుల్ ఆర్ టీమ్ ఈ కష్టాలు అన్నిటిని దాటింది. కానీ.. ట్రిపుల్ ఆర్ ని మొదటి నుండి వేధిస్తున్న సమస్య లీక్స్.
ట్రిపుల్ ఆర్ నుండి ఇప్పటికే చాలాసార్లు ఫుటేజ్ లీక్ అయ్యింది. గతంలో తారక్ తో ఫైట్ చేసే పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా చాలా సార్లు జరిగాక.. జక్కన్న టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుని లీక్స్ అరికట్టింది. కానీ.., తాజాగా ఇప్పుడు మరోసారి ట్రిపుల్ ఫుటేజ్ లీక్ అయ్యింది. ఈ పిక్స్ యాక్షన్ సీక్వెన్స్ నుండి కట్ చేసినట్టు స్పష్టంగా అర్ధం అవుతోంది. అయితే.. ఈ ఫోటోలలో తారక్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇందులో జూనియర్ భీమ్ గా కనిపించబోతున్నాడు. మరోవైపు ఈ పిక్స్ ట్రైలర్ నుండి కట్ చేసినవన్న టాక్ వినిపిస్తోంది. మరి.. లీక్డ్ పిక్స్ ఇంత హైప్ క్రియేట్ చేస్తుంటే.. సినిమా విడుదల అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి.. లీక్ అయిన పిక్స్ లో తారక్ ఎక్స్ ప్రెషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.