ఆస్కార్ తో కాదు మరోసారి ఎన్టీఆర్ వార్తల్లో నిలిచాడు. అది కూడా తను కట్టుకున్న వాచీతో. దాని కాస్ట్ చూసి నెటిజన్స్ నోట మాటరావట్లేదు. వాచీ అమ్మితే బ్యాచ్ సెటిలైపోతుందని పంచ్ డైలాగ్స్ కొడుతున్నారు.
తెలుగు ప్రేక్షకులు ఆస్కార్ మూడ్ నుంచి అస్సలు బయటకు రాలేకపోతున్నారు. తెలుగు పాటకు ప్రపంచం మెచ్చే అవార్డ్ వస్తే ఊరుకుంటారా ఏంటి? కచ్చితంగా గోల గోల చేయాల్సిందే. ఆస్కార్ గెలుచుకోవడం మాటేమో గానీ డైరెక్టర్ రాజమౌళి, హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్ కు గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది. వీళ్లు ఏం చేసినా, ఏం ధరించినా అవి కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ పెట్టుకున్న కాస్ట్ లీ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా అన్ని కోట్ల ఖరీదు చేస్తుందనేసరికి అందరూ అవాక్కవుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు ఎలా ఉండేదో గానీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీలు అందరూ ఫ్యాషన్ విషయంలో కాస్త ఎక్కువగానే శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడట్లేదు. సాధారణంగా చిన్న చిన్న ఈవెంట్స్ కే లక్షలు విలువ చేసే డ్రస్సులు, వాచ్, బ్యాగ్స్ లాంటివి ఉపయోగిస్తుంటారు. ఇక ఆస్కార్ లాంటి అంతర్జాతీయ వేడుక అంటే మినిమం రేంజ్ ఉండేలా చూసుకుంటారు. తాజాగా లాస్ ఏంజెల్స్ లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సతీసమేతంగా హాజరైంది. వాళ్లందరూ కూడా తమ తమ ఫ్యాషన్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
ఇక ఆస్కార్ వేడుకలో మన హీరోలు రామ్ చరణ్-ఎన్టీఆర్.. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో కనువిందు చేశారు. ఈ క్రమంలోనే నెటిజన్స్ దృష్టి.. తారక్ వాచీపై పడింది. దాని కాస్ట్ ఎంతో తెలుసుకునే పనిలో పడ్డారు. తీరా ఇప్పుడు దాని విలువ తెలిసి షాక్ లో ఉండిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ ధరించిన వాచ్.. ‘Patek Philippe Nautilus Travel Time’ అని తెలిసింది. దీని కాస్ట్ అక్షరాలా 1,90,000 డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ.1,56,69,870 అని తెలుస్తోంది. ఈ రేటు చూసిన నెటిజన్స్.. ఎన్టీఆర్ వాచీ అమ్మితే మన బ్యాచ్ మొత్తం సెటిలైపోద్ది అని మాట్లాడుకుంటున్నారు. మరి తారక్ వాచ్ కోట్లు ఖరీదు చేయడంపై మీరేం అంటారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.
.@tarak9999 looks suave in the latest pics. #NTR 🔥
#RRRForOscars #JrNTR pic.twitter.com/CH7mT7pL2V
— Suresh Kondi (@SureshKondi_) March 11, 2023