లేడీ సూపర్ స్టార్ నయనతార– డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వారి వివాహానకి సంబంధించిన ప్రోమోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. త్వరలోనే పూర్తి వీడియో మీ ముందుకు తీసుకొస్తాం అంటూ ప్రకటించారు. ఇటీవలే తమిళనాడులో జరిగిన చెస్ ఒలింపియాడ్ ను విఘ్నేశ్ శివన్ చక్కగా నిర్వహించడం చూశాం. ఇప్పుడు ఈ జంట వెకేషన్లో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం విఘ్నేశ్ శివన్– నయనతార సెంకడ్ హనీమూన్‌లో బిజీగా ఉన్నారు. స్పెయిన్‌లోని బార్సిలోనా వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను వారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఓకవైపు మోడ్రన్ డ్రెస్సు.. మరోవైపు మెడలో పసుపుతాడుతో నయనతార కనిపించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన సంప్రదాయాలకు నయన్ ఎంతో గౌరవం ఇస్తుంది అంటూ పొడుగుతున్నారు.
ఇంక నయనతార సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో మెరవనుంది. హిందీలో షారుక్ ఖాన్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చేతిలో ఆరు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. సెకెండ్ హనీమూన్ నుంచి తిరిగి రాగానే మళ్లీ షూటింగ్స్‌తో నయన్ బిజీగా మారనుంది. నయన్- విఘ్నేశ్ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.