యాంకర్ శ్రీముఖి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మాటలతో పాటు ఆకర్షించే అందం, అల్లరితో ప్రేక్షకులను ఎంతగానే అలరిస్తూ వస్తుంది. ప్రోగ్రామ్ ఏదైనా సరే స్టేజ్‌పై శ్రీముఖి ఉంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు. తనదైన పంచులు, కామెడీతో షోని రక్తికట్టిస్తుంది. పటాస్ షో తో బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకున్నారు శ్రీముఖి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది శ్రీముఖి. పలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌కి కావలసినంత వినోదాన్ని పంచుతుంది.
తాజాగా ఈ అమ్మడు మెగా బ్రదర్ నాగాబాబుతో ఓ ఫన్నీ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. బుల్లితెర స్టార్ శ్రీముఖి, మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ షూటింగ్లో పాల్గొన్నారు. ఖాళీ సమయంలో వీరిద్దరు పక్కన పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.
శ్రీముఖి నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా.. అంటూ నాగబాబు.. అడగండి బాబు గారు అని శ్రీముఖి.. నీ నోట్లోంచి ఓ చక్కటి పాట వినాలని ఉందని నాగబాబు అన్నారు. అప్పుడు శ్రీముఖి గట్టిగా ధర్ ధర్ తేరీ ముఖుడే.. అంటూ పాడింది.. అంతే నాగబాబు కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే శ్రీముఖ పక్కనే నాగబాబు ని బాబు గారూ అంటే లేపే ప్రయత్నం చేసింది. మనిషిని ఇలా కూడా చిత్ర హింసలు పెట్టొచ్చా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ నవ్వులు పూయిస్తుంది.