డబుల్ మీనింగ్ డవిలాగులు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. సినిమాల్లో ఉండే డవిలాగులు ఇప్పుడు టీవీ షోస్ లో కూడా మామూలు అయిపోయాయి. కామెడీ కోసం బూతు అర్థం వచ్చే పదాలను అవలీలగా వాడేస్తున్నారు. లేడీ యాంకర్లు కూడా డబుల్ మీనింగ్ జోకులను వేస్తున్నారు, తమ మీద వేయించుకుంటున్నారు. నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు, తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటున్నారు. టీవీ షోస్ లో వల్గారిటీ ఎక్కువైందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏ షో చూసినా డబుల్ మీనింగ్ డైలాగో, సెక్స్ కి సంబంధించిన డైలాగో ఉంటుంది. దీనికి తగ్గట్టు ఎక్స్ పోజింగ్ ఒకటి. బాడీ షేమింగ్, ఎక్స్ పోజింగ్, డబుల్ మీనింగ్ డైలాగులు లేకపోతే ఆ షో హిట్ అవ్వదు అనే పరిస్థితికి తీసుకొచ్చేశారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
మరి ఆ పరిస్థితిని చూసే ప్రేక్షకులు తెచ్చారా, షోస్ చేసే నిర్వాహకులు తెచ్చారా అన్నది పక్కన పెడితే.. తాజాగా ముక్కు అవినాష్ ని ఉద్దేశించి శృంగారం మీద శ్రీముఖి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆదివారం విత్ స్టార్ మా పరివార్ షోలో శ్రీముఖి, ముక్కు అవినాష్ హోస్ట్ లుగా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలయ్యింది. ఈ ఎపిసోడ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నటులు కస్తూరి, ఇంద్రనీల్, బ్రహ్మముడి సీరియల్ నటులు మానస్, దీపికా రంగరాజు యాంకర్ ప్రశాంతి, ఫైమా తదితరులు వచ్చారు. ఇక అవినాష్ పై వరుస పంచులు వేశారు. ఇక ఫైమా ‘ఐ వాంట్ కసి’ అంటే.. ‘నీకు కసి కావాలంటే ఇంద్రనీల్ నేర్పిస్తాడు’ అంటూ ప్రశాంతి డబుల్ మీనింగ్ జోక్ పేల్చారు. ఇంద్రనీల్ ని ఉద్దేశించి.. ‘ఒక పసిబిడ్డని కసి నేర్పిస్తాడని చెప్పడం ఏమిటండి’ అంటూ కస్తూరి అన్నారు.
అప్పుడు శ్రీముఖి.. ఏ యాంగిల్ లో ఆయన పసిబిడ్డలా ఉన్నాడండి అంటూ శ్రీముఖి పంచ్ వేసింది. ఇక శ్రీముఖి నవరసాలను పండించే టాస్క్ పెట్టింది. హమీదాను రౌద్రం, బీభత్సం రసాలను ప్రదర్శించమంటే ఆమె కామెడీ చేసి పడేసింది. ఇప్పుడు శృంగారానికి ఇదే సమయం అంటూ శ్రీముఖి శృంగార రసం చూపించమంది. అవినాష్, హమీదా శృంగార రసం పలికించగా.. శ్రీముఖి అవినాష్ పై సెటైర్లు వేసింది. ‘హమీదాది శృంగారంలాగే ఉంది. వీడిది కసి ప్లస్ ఆకలిలా ఉంది’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.