టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూయడం జరుగుతోంది. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు.. పాతతరం సినీ నటుడు, రంగస్థల కళాకారుడు పి. వెంకటేశ్వర రావు కన్నమూశారు. గత కొంతకాంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కోఠిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వెంకటేశ్వరరావుకి భార్య లక్ష్మి, ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు సంతానం ఉన్నారు.
పి.వెంకటేశ్వర రావు పూర్తిపేరు పిసుపాటి వేంకటేశ్వర రావు. రంగస్థలం కళాకరుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ‘ఇదేమిటి’ నాటకంలో ఆంధ్రనాటక కళాపరిషత్ వారిచేత ఉత్తమ కమెడియన్ అవార్డును, ‘మురారి’ నాటకంలో నటనకుగాను ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ‘తేనే మనసులు’ చిత్రంలో హాస్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. హాస్య నటుడిగా కెరీర్ ప్రారంభించినా.. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.’ కన్నెమనసులు’, ‘ఆత్మీయులు’, ‘మరోప్రపంచం’, ‘సుడిగుండాలు’, ‘మట్టిలో మాణిక్యం’, ‘ముత్యాలముగ్గు’ చిత్రాల్లో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా.. వెంకటేశ్వర రావు మృతి పట్ల పలువురు సినీ, నాటక రంగ కళాకారులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నారు.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
