Mumtaj: ప్రముఖ నటి ముంతాజ్‌పై శిశుహింస(చైల్డ్ అబ్యూజ్) కేసు నమోదైంది. ముంతాజ్ ఇంట్లో పనిచేస్తున్న బాలికలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంతాజ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు బాలికలు బుధవారం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. తమను నటి హింసిస్తోందని, ఇంటికి కూడా పంపకుండా వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముంతాజ్ ఇంటికి వెళ్లారు. ఫిర్యాదు చేసిన బాలికలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆ ఇంట్లో పనికి చేరే సమయానికి వారి వయసు 15 సంవత్సరాలు కూడా లేదని తేలింది. ముంతాజ్ వారిని హింసిస్తోందని బాలికలు చెప్పటంతో పోలీసులు ఆమెపై శిశుహింస కేసు నమోదు చేశారు.
కాగా, నగ్మా ఖాన్ అలియాస్ ముంతాజ్.. టీ రాజేందర్ దర్శకత్వం వహించిన మోనిస ఎన్ మోనాలీసా సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ‘‘చాలా బాగుంది’’ సినిమాలో ఓ సాంగ్‌తో తెలుగు తెరపై అడుగుపెట్టారు. అమ్మో! ఒకటో తారీఖు , ఖుషి, జెమిని, కూలీ, కొండవీటి సింహాసనం, పెళ్లికాని పెళ్లాం అవుతుంది, అత్తారింటికి దారేది(సాంగ్), ఆగడు, టామీ సినిమాల్లో నటించారు. మరి, శిశు హింస కేసులో నటి అరెస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sarkaru Vaari Paata: మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ USA రివ్యూ!