Mumtaj: ప్రముఖ నటి ముంతాజ్‌పై శిశుహింస(చైల్డ్ అబ్యూజ్) కేసు నమోదైంది. ముంతాజ్ ఇంట్లో పనిచేస్తున్న బాలికలు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంతాజ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు బాలికలు బుధవారం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశారు. తమను నటి హింసిస్తోందని, ఇంటికి కూడా పంపకుండా వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముంతాజ్ ఇంటికి వెళ్లారు. ఫిర్యాదు చేసిన బాలికలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆ ఇంట్లో పనికి చేరే సమయానికి […]