నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు మోక్షజ్ఞ ఏం చేస్తున్నాడో, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అనేది సస్పెన్స్ గా మారింది. చిన్న వయసే కదా, హీరోగా రావడానికి ఇంకా టైముందిలే అని కొంతమంది అభిమానులు సర్ది చెప్పుకుంటున్నారు. సినిమాల్లో కనబడకపోయాడు, కనీసం మనిషి కనబడితే ఒక ధైర్యం, ఒక ఊపు వస్తుంది. అలా కూడా కనిపించట్లేదే. సోషల్ గా దూరం, సోషల్ మీడియాకి దూరం. కానీ అప్పుడప్పుడూ మెరుపులా మెరిసి వెళ్లిపోతుంటాడు. మొన్నా మధ్య తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో తండ్రితో కలిసి జన్మదిన వేడుకలు చేసుకుని సందడి చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు థియేటర్ లో తారసపడ్డాడు.
మాదాపూర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చెందిన ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో నందమూరి మోక్షజ్ఞ దర్శనమిచ్చాడు. పక్కన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా ఒక్కడే సోలోగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఏ సినిమా చూడ్డానికి వెళ్ళాడో తెలియదు గానీ మోక్షజ్ఞని చూసిన జనం ఒక్కసారిగా చుట్టూ మూగి సెల్ఫీలు తీసుకున్నారు. మోక్షజ్ఞ థియేటర్ లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియో చూసిన నందమూరి అభిమానులు.. “యంగ్ లయన్ వస్తోంది చూడండి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.