సినీ ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకునే నటులను అరుదుగా చూస్తుంటాం. డెబ్యూ కాకపోయినా ఇండస్ట్రీలో ఫలానా కొత్త హీరోయిన్ చాలా బాగా నటించింది అనిపించుకోవడం రెగ్యులర్ గా వింటుంటాం. కానీ.. ఒక కొత్త నటి మొదటి సినిమాలోనే యాక్టింగ్ చింపేసిందని కొంతమంది అనిపిస్తారు. అలా ఈ ఏడాది టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది బాంధవి శ్రీధర్. ఈమెను గుర్తుపట్టాలంటే పేరొక్కటే సరిపోదు.. మసూద సినిమాలో దయ్యం పట్టిన అమ్మాయిగా నటించింది అంటే ఈజీగా గుర్తొస్తుంది. అవును.. 2022లో బెస్ట్ హార్రర్ మూవీ మసూద. ఈ సినిమాలో నాజియా పాత్రలో నటించింది ఈ బాంధవి శ్రీధర్.
ఒక సినిమాలో కొత్తగా హీరోయిన్ నచ్చినా.. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నచ్చినా వెంటనే వాళ్ళ గురించి వివరాలు ఆరా తీయడం అందరికీ అలవాటే. ఇప్పుడు మసూద మూవీ వచ్చాక అందరూ అందులో నటించిన మసూద క్యారెక్టర్, నాజియా క్యారెక్టర్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. హారర్ మూవీ కాబట్టి.. ఎలాగో భయపెడతారు. కానీ.. నాజియా క్యారెక్టర్ లో బాంధవి అల్లాడించేసింది.. థియేటర్ లో అందరినీ వణికించేసింది అనే చెప్పాలి. అయితే.. ఇంతకీ ఈ బాంధవి శ్రీధర్ ఎవరు? ఇదివరకు ఏయే సినిమాలు చేసింది? షార్ట్ ఫిలిమ్స్ చేసిందా లేక ఇంకేమైనా చేసిందా? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే సందేహాలు అందరిలో కలిగాయి.
అసలు విషయం ఏంటంటే.. బాంధవి శ్రీధర్ పక్కా తెలుగమ్మాయి. గుంటూరు జిల్లాకు చెందిన ఈమె.. మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి వచ్చింది. 2019లో మిస్ ఇండియా రన్నరప్ గా నిలిచిన బాంధవి.. అదే ఏడాది మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో విజేతగా నిలిచింది. ఇక మసూద మూవీనే తన ఫస్ట్ మూవీ. ఇదివరకు ఏ సినిమాలు, సీరియల్స్ లోనూ నటించలేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్న టైంలో మసూద మూవీ ఆఫర్ రావడంతో.. కంటెంట్, క్యారెక్టర్ నచ్చి ఓకే చేసిందట. అలాగే నటిగా ఫస్ట్ మూవీ కాబట్టి.. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లభించిందని చెప్పింది బాంధవి.
ఇక బాంధవి స్టడీస్, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. తానిప్పుడు బిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. బాంధవి ఫాదర్ ఇండస్ట్రీలో దాదాపు 20 ఏళ్లుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారట. ఇక తనకు యాక్టింగ్ సైడ్ ఇంటరెస్ట్ ఉండటంతో పేరెంట్స్ సపోర్ట్ చేశారని.. వారి సపోర్ట్ తోనే మిస్ ఇండియా కాంపిటీషన్స్ లో పాల్గొన్నట్లు చెప్పింది. ప్రస్తుతం మసూద సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న బాంధవి.. నెక్స్ట్ హీరోయిన్ గా చేయడానికి, లేదా మంచి రోల్ దొరికితే చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలిపింది. అదీగాక మసూద మూవీతో బాంధవికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిందట. చూడాలి మరి దయ్యం పట్టిన అమ్మాయిగా డెబ్యూ చేసిన ఈ బ్యూటీ.. మున్ముందు ఎలాంటి క్యారెక్టర్స్ తో మెప్పిస్తుందో! మరి మసూద మూవీ చూసినవారు బాంధవి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.