ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్ల పాలసీ ఒకటే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటారు. అందుకు తగ్గట్లే అంది వచ్చిన అవకాశాన్ని కరెక్ట్ గా చేజిక్కుంచుకుని సినిమాలు చేస్తారు. హిట్ కొట్టి స్టార్ స్టేటస్ సంపాదిస్తారు లేదంటే ఎంత ఫాస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చారో అంతే ఫాస్ట్ గా కనుమరుగైపోతారు. కొన్నాళ్ల తర్వాత సోషల్ మీడియా లేదా మీడియాలో కనిపిస్తారు. సడన్ గా వాళ్లను చూసి గుర్తుపట్టడం కూడా కష్టమైపోతుంది. ఈ మధ్య కాలంలో అలా చాలామంది హీరోయిన్లు బయటకొస్తున్నారు. సేమ్ అలానే ఓ హీరోయిన్ హైదరాబాద్ లో కనిపించింది. ఆమెని చూసి చాలామంది షాకయ్యారు. కొందరైతే ఇప్పటికీ ఆమె ఎవరా అని ఆలోచిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ss రాజమౌళి ఈ పేరు చెబితే ఇప్పుడు ఆలోవర్ వరల్డ్ షేక్ అయిపోతుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలతో జక్కన్న రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కెరీర్ లో ఇప్పటివరకు 12 మూవీస్ తీస్తే.. ప్రతిదీ కూడా హిట్ లేదంటే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక రాజమౌళి అంటే అన్ని భారీ బడ్జెట్ చిత్రాలే తీస్తాడనుకుంటే పొరపాటు. ఎందుకంటే ‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వరసగా ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ లాంటి చాలా స్మాల్ బడ్జెట్ ఫిల్స్మ్ అది కూడా అప్పట్లో నార్మల్ స్టార్స్ గా ఉన్నవారిని పెట్టి ఈ మూవీస్ తీసేశాడు. అయితే వీటిలో ‘ఈగ’ టెక్నికల్ వండర్ గా నిలిచి పేరు సంపాదించింది.
ఇక ‘మర్యాద రామన్న’ మాత్రం చాలా సింపుల్ స్టోరీ. సునీల్ లాంటి కమెడియన్ ని హీరోగా పెట్టి రాజమౌళి సినిమా తీస్తాడని, హిట్ కొడతాడని ఎవరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. దాన్నే రియాలిటీలో ప్రూవ్ చేసి చూపించాడు జక్కన్న. ఇక ‘మగధీర’లో ఓ సాంగ్ లో జస్ట్ అలా కనిపించిన సలోని అనే నటిని తీసుకొచ్చి ‘మర్యాద రామన్న’లో హీరోయిన్ ని చేశాడు. ఈ సినిమాకు ముందు గానీ తర్వాత గానీ సలోని గురించి ఎవరికీ తెలియదు. యాక్ట్ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా ఎప్పుడొచ్చి వెళ్లాయనేది అస్సలు తెలీదు. ఇప్పుడు ఆమెనే చాలారోజుల తర్వాత హైదరాబాద్ లో కనిపించింది. ఓ జ్యూవెలరీ ర్యాంప్ షో కోసం కనిపించింది. కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కాస్త బొద్దుగా ఉండేసరికి చాలామంది ఆమెని గుర్తుపట్టలేకపోయారు. మరి మీలో ఎంతమంది ఈమె పేరుని సరిగ్గా గెస్ చేశారు. కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.