చిత్రపరిశ్రమలో నటులుగా రాణించి ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టిన సెలబ్రిటీలను చాలామందిని చూస్తున్నాం. అలా ముందుగా సినిమాలలో హీరోగా చేసి.. ప్రస్తుతం అధికారపార్టీ బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్న నటుడు మనోజ్ తివారి. భోజ్ పురి ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన మనోజ్ తివారి.. తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తమ ఇంట్లోకి లక్ష్మి తర్వాత ఇప్పుడు సరస్వతి ఇంటికి వచ్చిందని.. తనను స్వాగతించేందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ తెలిపాడు. దీంతో మనోజ్ తివారి దంపతులకు కూతురు పుట్టిందని తెలిసిన అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
మనోజ్ తివారి గురించి భోజ్ పురి, హిందీ సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు 2003 నుండి 2014 వరకు ఇండస్ట్రీలో నటుడిగా యాక్టీవ్ గా ఉన్నాడు మనోజ్. పలు సినిమాలలో హీరోగా నటించడమే కాకుండా.. ఆ తర్వాత కీలక పాత్రలు పోషిస్తూ వచ్చాడు. అయితే.. మనోజ్ రెండో భార్య సురభి సోమవారం పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కూతురు పుట్టిన ఆనందాన్ని షేర్ చేస్తూ.. “మా ఇంటికి లక్ష్మి తర్వాత సరస్వతి వచ్చింది. ఈ విషయం మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మాకు అందమైన చిన్నారి జన్మించింది. మీరంతా మా బిడ్డను ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఇట్లు మీ సురభి – మనోజ్ కుమార్” అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా.. మనోజ్ తివారి ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. మనోజ్ కి సురభి రెండో భార్య. కాగా.. 1999లో రాణి తివారిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2012లో ఆమెతో విడిపోయాడు. వీరికి రితి అనే కూతురు ఉంది. ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు అంటే. .2020లో సురభి తివారిని పెళ్లి చేసుకోగా.. అదే ఏడాది వీరికి ఓ కూతురు జన్మించింది. ఇక మనోజ్ తివారి వయసు 51 ఏళ్ళు.. మూడో కూతురికి జన్మనిచ్చి వార్తల్లో నిలిచారు. తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని చెబుతూ.. భార్య సురభితో హాస్పిటల్ లో ఉన్న పిక్ షేర్ చేశాడు. ప్రస్తుతం మనోజ్ తివారి లేటు వయసులో మరోసారి తండ్రైన విషయం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
बड़े हर्ष के साथ सूचित करना है कि मेरे घर में लक्ष्मी के बाद सरस्वती का आगमन हुआ है..आज घर में प्यारी सी बिटिया पैदा हुई है.. उसपे आप सभी का आशीर्वाद बना रहे.. सुरभि-मनोज तिवारी pic.twitter.com/JJj1H82XEr
— Manoj Tiwari 🇮🇳 (@ManojTiwariMP) December 12, 2022