‘ఎవరూ చూడటం లేదని తెలిసినప్పుడు.. డాన్స్ చేస్తే పిచ్చ క్రేజ్’ అంటూ వీడియోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది మంచు లక్ష్మీ. ఆమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన అప్‌డేట్స్ అన్ని సామాజిక మాద్యమాల ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. జూన్ 21 యోగా దినోత్సవం మాత్రమే కాదు,మ్యూజిక్ డే కూడా. యోగాసనాలతో ఆకట్టుకున్న మంచు లక్ష్మీ మ్యూజిక్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుంది. దళపతి విజయ్ `మాస్టర్` సినిమాలోని మాస్ బీట్‌కి అదిరిపోయే డాన్స్ లో కేకపెట్టించింది. వీడియోలో మంచు లక్ష్మి చీరకట్టులోనే ఉంది అసలు అందం అనేట్టుగా ఒంపుసొంపుల వయ్యారాలను వడ్డించారు. ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా తల్లితో జతకలిసి మాస్ స్టెప్పులు వేసింది. మంచు లక్ష్మీ తనలోని మాస్ యాంగిల్ చూపించింది.
చీరకట్టు కనువిందు చేయడంతో ఆమె ఫాలోవర్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు. కొంతమంది ఆహా ఓహో అని అంటుంటే మరికొంతమంది మాత్రం ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్లతో ట్రోల్స్ మొదలుపెట్టారు.ప్రస్తుతం ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మంచు లక్ష్మి బెస్ట్ ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్‌కి అయితే ఈ వీడియో తెగ నచ్చేయడంతో లైక్స్ కొట్టింది. ఆమెతో మరికొంతమంది మంచు లక్ష్మి మాస్ డాన్స్‌కి ఫిదా అవుతున్నారు.