తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజ నటుల్లో మోహన్ బాబు ఒకరు. 1975 సంవత్సరంలో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన వారసులు మంచు లక్మ్షిప్రసన్న, విష్ణు, మనోజ్ కూడా ఇదే రంగంలో కొనసాగుతున్నారు. కుమారులతో పోలిస్తే… మంచు వారసులు మంచు లక్ష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమ కుటుంబానికి సంబంధించిన విషయాలు, యోగా, ఇతర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. తాజాగా అలా షేర్ చేసిన ఓ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఇటీవల ఆమె వరుస ఫోటో షూట్ లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోస్ ను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాజాగా పోస్టు చేసిన ఓ ఫోటోలో హాట్ లుక్ తో మెస్మరైజ్ చేస్తున్నారు మంచు వారింటమ్మాయి. కాస్ట్యూమ్ డిజైనర్ అభిషేక్ శర్మ డిజైన్ చేసిన ఔట్ ఫిట్ లో మతులు పోగొడుతున్నారు. 40 ప్లస్ అయినా తనలో ఏ మాత్రం అందం తగ్గలేదనట్లున్నాయి ఆ ఫోటోలు. బేబీ పింక్ కలర్ డ్రెస్ లో ఇచ్చిన ఫోజులు కుర్రకారు మదిని దోచేస్తున్నాయి. దీనికి తోడు ఓ క్యాప్షన్ జోడించారు ఈ సెలబ్రిటీ కిడ్. మీరు కోరుకునే శక్తంతా మీలో ఉందని, మీరు చేయాల్లిందల్లా..చూస్తూ ఉండటమే అంటూ పేర్కొన్నారు.
తెలుగు తెరకు రాకముందే హాలీవుడ్ లో నటిగా తన కెరీర్ ను ప్రారంభించారు మంచు లక్ష్మి. అనంతరం అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు విలన్ గా పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఐరేంద్రి క్యారెక్టర్ లో మెప్పించారు. గుండెల్లో గోదారి, ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా, దొంగాట, చందమామ కథలు, పిట్ట కథలు (వెబ్ సిరీస్) వంటి వాటిలో పలు క్యారెక్టర్లు పోషించి.. నటిగా తన సత్తా చాటారు. అటు మాలీవుడ్, కోలీవుడ్ లోనూ అడుగుపెట్టారు. యాంకర్ గా, నిర్మాతగానూ, యూట్యూబర్ గా మారి.. తనలో విలక్షణ నటి ఉందని నిరూపించుకున్నారు. ప్రస్తుతం అగ్ని నక్షత్రం, లేచింది మహిళా లోకం చిత్రాల్లో నటిస్తున్నారు.