ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాల నుండి సాంగ్స్, డైలాగ్స్ ఏవి రిలీజైనా అభిమానులు సందడి చేయడం మాములే. అదే స్టార్ హీరోల సాంగ్స్ కి వేరే సెలబ్రిటీలు డాన్స్ చేయడం.. డైలాగ్స్ ని స్పూఫ్ చేయడం చూస్తే ఫ్యాన్స్ లో కలిగే ఆనందమే వేరు. ఇటీవల అందరు హీరోల పాటలకు స్టెప్పులేస్తూ రీల్స్, కవర్ సాంగ్స్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుండి మాంచి ఊపున్న ‘బాస్ పార్టీ’ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది. అలాగే ఈ పాటకు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా అందరు సెలబ్రిటీలు డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తున్నారు.
తాజాగా ఇదే బాస్ పార్టీ పాటకు స్టెప్పులేసి మెగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది నటి మంచు లక్ష్మి. ఒరిజినల్ సాంగ్ లో చిరుతో కలిసి బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా డాన్స్ ఇరగదీసింది. ఇక్కడ మంచు లక్ష్మి వచ్చేసరికి.. నటుడు రంగస్థలం మహేష్ తో మాస్ స్టెప్స్ వేసి అదరగొట్టింది. పైగా ప్యాంటు షర్ట్ లోనే డాన్స్ చేసి.. మెగాస్టార్ సాంగ్ కి కాలు కదపడం ఎప్పుడూ ఫన్ గానే ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం చిరు సాంగ్ కి మంచు విష్ణు డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. అయితే.. బాస్ పార్టీ పాటకి మంచు లక్ష్మి వేసిన స్టెప్పులు నెటిజన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మంచు లక్ష్మి పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మోహన్ లాల్ నటించిన ‘మాన్ స్టర్’ సినిమాతో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇక లక్ష్మి చేతిలో ప్రెజెంట్ అగ్నినక్షత్రం, లేచింది మహిళా లోకం సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే.. చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ అవుతోంది. కాగా, మైత్రి మూవీస్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాని.. డైరెక్టర్ బాబీ(కేఎస్ రవీంద్ర) రూపొందించారు. మరి బాస్ పార్టీ పాటకు మంచు లక్ష్మి డాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Always fun dancing to megastars’ songs. https://t.co/NeoX9jRuXC
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 29, 2022