సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు బయట వ్యాపారాలలో కూడా విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎంతోమంది హీరోలు బిజినెస్ లో రాణిస్తున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందంజలో ఉన్నాడు. అయితే.. మహేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తూనే, ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏషియన్ సినిమాస్ వారితో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి థియేటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏఎంబి థియేటర్ బెస్ట్ థియేటర్స్ లో ఒకటిగా దూసుకుపోతుంది. కాగా, ఇప్పుడు తాజాగా మహేష్ బాబు – నమ్రత దంపతులు ఏషియన్ వారితోనే మరో క్రేజీ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.
ఇక ఏషియన్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు, నమ్రతలు కొత్తగా రెస్టారెంట్ బిజినెస్ లో చేతులు కలిపారు. తాజాగా రెస్టారెంట్ కి సంబంధించి ఏసియన్స్ వారు పూజా కార్యక్రమాలు పూర్తిచేశారు. అయితే.. ఈ రెస్టారెంట్ ని ఏషియన్స్ వారితో పాటు నమ్రత పేరు కలిసి వచ్చేలా పెట్టడం విశేషం. ఏఎన్ రెస్టారెంట్(మినర్వా కాఫీ షాప్, ప్యాలస్ హైట్స్)గా పేరు పెట్టిన ఈ రెస్టారెంట్ ని మున్ముందు మరింత అభివృద్ధి చేసి.. దేశవ్యాప్తంగా నెట్ వర్క్ ని డెవలప్ చేసే దిశగా ఆలోచన చేస్తున్నారట. ఏఎన్ అనే పేరులో ఏ అంటే ఏషియన్స్.. ఎన్ అంటే నమ్రత అని సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీలో సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించడంతో.. మహేష్ బాబు దంపతులు ఈ రెస్టారెంట్ పూజా కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. మొత్తం రెండు రెస్టారెంట్స్ కాగా.. ఒకటి డిసెంబర్ 1న స్టార్ట్ చేసి.. మరో రెస్టారెంట్ ని డిసెంబర్ చివరిలో ప్రారంభించనున్నారట.

ఇదిలా ఉండగా.. బిజినెస్ రంగంలో మహేష్ బాబుకి మంచి పేరుంది. ఆయన పెట్టిన ప్రతి బిజినెస్ లో సక్సెస్ అయ్యారని.. ఇది కూడా సక్సెస్ అవుతుందని ఏషియన్స్ వారు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ పరంగా చూసుకుంటే.. ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో పాన్ వరల్డ్ మూవీ చేయనున్నాడు. రాజమౌళితో చేయబోయే సినిమా గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కనుంది. చూడాలి మరి పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న మహేష్.. ఈసారి రాజమౌళి సినిమాతో వరల్డ్ ని షేక్ చేస్తాడేమో!
