మహా భారతం సీరియల్‌లో ఆయన పోషించిన శకుని పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆ పాత్ర కారణంగా ఎంతో మంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు.
1980-90లలో పిచ్చ పాపురాలిటీ తెచ్చుకున్న షోలలో మహాభారత్ ముందు వరుసలో ఉంటుంది. అప్పట్లో దూరదర్శన్‌లో వచ్చిన ఈ సీరియల్‌కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉండేవారు. వాస్తవానికి ఈ షోకు ఇప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇక, మహాభారతం సీరియల్‌లోని ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కీలక పాత్రల్లో నటించిన వారికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక, ఈ సీరియల్‌లో శకుని పాత్ర చేసిన గుఫి పైంతల్‌కు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం గుఫి పైంతల్‌కు సంబంధించిన విషాద వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. గుఫి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. తాజాగా, తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గుఫి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన మనేల్లుడు హితెన్ పైంతల్ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో గుఫి పైంతల్ అనారోగ్యం గురించి వివరించారు. గుఫి తొందరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేయాలని కోరారు. కాగా, గుఫి నటుడిగానే కాదు.. దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. పలు హిట్టు సినిమాలకు దర్శకత్వం వహించారు. మరి, మహాభారతం సీరియల్‌లో శకుని పాత్ర చేసి అందరినీ మెప్పించిన గుఫి పైంతల్ అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.