రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించింది. అయితే షూటింగ్ సమయంలో ఒకరోజు రమ్యకృష్ణతో ఒక సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు ఆమెను చూసి ఏడ్చేశానని కృష్ణవంశీ అన్నారు. ఆ రోజు సరిగా నిద్ర పట్టలేదని అన్నారు.
ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించిన చిత్రం రంగమార్తాండ. ఇళయరాజా సంగీత సారథ్యంలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రం. చాలా కాలం విరామం తర్వాత కృష్ణవంశీ ఈ సినిమాతో వస్తున్నారు. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ తిరిగే కథను మనకు పరిచయం చేయబోతున్నారు. మరాఠీలో విజయం సాధించిన నట్ సామ్రాట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఉగాది సందర్భంగా ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఈ క్రమంలో దర్శకుడు కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆయన రమ్యకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేశానని అన్నారు. ఇక తమ ఇంట్లో ఏ నిర్ణయమైనా తన భార్య రమ్యకృష్ణనే తీసుకుంటుందని, ఆమె లేని సమయంలో తాము నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయితే ఆ నిర్ణయంలో మార్పులు, చేర్పులు చేయమని రమ్యకృష్ణ సూచిస్తుంటుందని.. కానీ తాను పెద్దగా పట్టించుకోనని అన్నారు. ఇక రమ్యకృష్ణకు పవర్ ఫుల్ కళ్ళు ఉన్నాయని.. అరుపులు, కేకలు కాకుండా కళ్ళతో నటించాలని చెప్పగానే ఈ సినిమా ఒప్పుకుందని అన్నారు.
ఈ సినిమాలో తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుందని.. ఆమె ఎప్పుడూ ఒక విజన్ తో ముందుకెళ్తుందని అన్నారు. ఇక రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశానని కృష్ణవంశీ అన్నారు. ఈ సినిమాలో ఆఖరు చాప్టర్ లో రమ్యకృష్ణకు సంబంధించిన సన్నివేశాన్ని షూట్ చేయడానికి చచ్చిపోయానని.. దాదాపు 36 గంటల పాటు షూటింగ్ చేశామని అన్నారు. రమ్యకృష్ణను ఆ సీన్ లో చిత్రీకరించడానికి సెంటిమెంట్ అడ్డొచ్చిందని, కానీ తప్పదు కాబట్టి షూట్ చేశానని అన్నారు. అయితే షూట్ చేస్తున్నంతసేపు కళ్ళలోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయని.. ఆరోజు రాత్రి నిద్రపట్టలేదని అన్నారు. ఒకరకంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశానని ఎమోషనల్ అయ్యారు. మరి రమ్యకృష్ణని సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నానన్న కృష్ణవంశీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.