చిత్రసీమలో హాస్యబ్రహ్మగా పేరొందిన లెజెండరీ నటుడు బ్రహ్మానందం. దాదాపు ముప్పై ఐదేళ్లకు పైగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. పన్నెండు వందలకు పైగా సినిమాలలో నటించి.. గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. కెరీర్ లో ఎన్నో వందల వెరైటీ క్యారెక్టర్స్ పోషించిన బ్రహ్మానందం.. తెలుగు మనిషి కావడం తెలుగువారంతా ఎంతో గర్వించదగిన విషయం. తాజాగా రంగమార్తాండ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ బ్రహ్మానందం క్యారెక్టర్ చూసి ఎమోషనల్ అవుతున్నారు
స్టార్ యాంకర్, నటి అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. ప్రస్తుతం నటిగా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాతో నటిగా మారిన అనసూయ.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తోంది. ఇక అనసూయ నటించిన కొత్త సినిమా 'రంగమార్తాండ' రిలీజ్ కి రెడీ అయ్యింది. తాజాగా రంగమార్తాండ ప్రెస్ మీట్ లో స్టేజ్ పై కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.
రమ్యకృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించింది. అయితే షూటింగ్ సమయంలో ఒకరోజు రమ్యకృష్ణతో ఒక సీన్ ని షూట్ చేస్తున్నప్పుడు ఆమెను చూసి ఏడ్చేశానని కృష్ణవంశీ అన్నారు. ఆ రోజు సరిగా నిద్ర పట్టలేదని అన్నారు.
సినిమా అంటే.. మూడు పాటలు, ఆరు ఫైట్లు, రెండు జోకులు.. అనుకుంటారు కొందరు. కానీ సినిమాకు అర్థం ఇదికాదు. సినిమా అంటే సమకాలీన సమాజానికి ప్రతిబింబం.. ఓ దర్శకుడి ఆలోచనలకు ప్రతిరూపం.. భవిష్యత్ ఆచరణలకు ఆదర్శం. గ్రహించాలే గానీ ఒక్కో సినిమాలో ఒక్కో.. మంచితనం ఉంటుంది. ఇక వెండితెరపై వెలుగుతున్న అందరి కథానాయకుల జీవితాలు వెండివెలుగులు నింపుకున్న జీవితాలు కావు. అలాంటి కథానాయకులు తెరపైకి రాకముందు రంగస్థలంపై పడ్డ కష్టాలను ‘రంగమార్తాండ’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు […]