ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుక అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి సైతం సినీ తారలు బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, చార్మీకౌర్, విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, తమన్నా, పూజా హెగ్దే, రకుల్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు. ఇంక బీ టౌన్ లో ఉన్న ప్రతి టాప్ సెలబ్రిటీ, అగ్ర హీరోలు, హీరోయిన్లు ఆ పార్టీకి హాజరయ్యారు. కరణ్ జోహార్ ధరించిన ఫుల్ గ్రీన్ షిమ్మెరీ జాకెట్ అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. కరణ్ జోహార్ బర్త్ డే పార్టీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.