‘కేజీఎఫ్’.. మన దేశంలో తీసిన వాటిలో అద్భుతమైన సినిమా. మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన సినిమా. దీని తర్వాత కన్నడ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘కాంతార’. చెప్పాలంటే ఈ రెండింటిని నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ. అయితే ఈ రెండు చిత్రాలకు చాలా తేడా ఉంది. ఒకటి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూళ్లు సాధించగా.. మరొకటి రెండు పార్టులుగా రిలీజైన వేల కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘కాంతార’లో యాక్ట్ చేసిన ప్రముఖ నటుడు.. ‘కేజీఎఫ్’పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి కాస్త వైరల్ గా మారాయి.
ఇక విషయానికొస్తే.. కొందరి అభిప్రాయం ప్రకారం ‘కేజీఎఫ్’ గొప్ప సినిమాయేం కాదు. ఎందుకంటే ఇదే తరహా కాన్సెప్ట్ తో గతంలోనే చాలా సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. కాకపోతే ఇందులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టేకింగ్ లాంటి అద్భుతంగా ఉండేసరికి ప్రేక్షకులు పిచ్చిపిచ్చిగా చూశారు. తెలుగులోన ‘కేజీఎఫ్ 2’ వసూళ్లు రూ.100 కోట్లపైనే. మరోవైపు ‘కాంతార’.. కేవలం రూ.15 కోట్లతో తీసి కన్నడలోనే రిలీజ్ చేశారు. కానీ అనుహ్యంగా ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. ఏకంగా రూ.400 కోట్లపైనే వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలో రిషభ్ తోపాటు యాక్ట్ చేసిన కిశోర్ కూడా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడే ఇప్పుడు ఇండియా టుడేతో మాట్లాడుతూ ‘కేజీఎఫ్’ని చెత్త సినిమా అనేశాడు.
‘ఇది సరైన పోలికనో కాదో తెలియదు కానీ నేను ‘కేజీఎఫ్ 2′ చూడలేదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను’ అని కిశోర్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాల్లో విలన్ తరహా రోల్స్ చేసిన కిశోర్ చాలానే ఫేమ్ సంపాదించాడు. 2022లో పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. మరి నటుడు కిశోర్.. ‘కేజీఎఫ్’ని చెత్త సినిమా అనడంపై మీరేం అంటారు. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.