కన్నడ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా రిలీజ్ అయిన కాంతార అనూహ్య విజయం సాధించడంతో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా ఎంతగానో మారుమోగిపోయింది.
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. అభిమానులు స్టార్ హీరోల మధ్య ఎప్పుడూ కాంపిటేషన్ మాత్రమే చూస్తుంటారు.. కానీ రీల్ లైఫ్ లో వారి స్నేహం గురించి చాలా తక్కువ మందికే తెలుస్తుంది. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళంలో రజినీ, కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, మమ్ముట్టి వీరు వెండితెరపై ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా బయట మాత్రం మంచి స్నేహితులు అంటారు. ఇక కన్నడంలో ప్రాణ స్నేహితులు కొనసాగిన వారిలో విష్ణువర్థన్, డా. అంబరీష్ అంటారు. కాంతార మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిన రిషబ్ శెట్టికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
పాన్ ఇండియా మూవీగా వచ్చిన ‘కాంతార’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కెజిఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న నిర్మాతలు ‘కాంతార’ మూవీని కేవలం రూ. 16 కోట్లతో నిర్మించారు. ఈ చిత్రం అంచనాలకు మించి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ అన్ని భాషల్లో కలిపి రూ. 400 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఈ మూవీ లో నటించిన రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా ఎంతగానో మారుమోగిపోయింది. తాజాగా రిషబ్ శెట్టి స్నేహబంధానికి గురించి తెలియజెప్పే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జులై 7న రిషబ్ శెట్టి పుట్టిన రోజు.. ఈ సందర్భంగా అతని ప్రాణ స్నేహితులు అయిన రక్షిత్ శెట్టి మరో స్నేహితుడి ప్రమోద్ శెట్టి ముగ్గురు కలిసి ఒకే కంచంలో భోజనం చేశారు. ఈ వీడియో కన్నడ నటి శీతల్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
కన్నడ ఇండస్ట్రీలో ‘తుగ్లక్’ మూవీతో రిషబ్, రక్షిత్ శెట్టి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ మూవీలో రిషబ్ శెట్టి చిన్న క్యారెక్టర్ పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం రక్షిత్ శెట్టికి అనుకున్నంతగా సక్సెస్ ఇవ్వకపోవడంతో బాగా కుంగిపోయాడు. అదే సమయంలో రిషబ్ శెట్టి ‘కిరాక్ పార్టీ’ కథను రక్షిత్ శెట్టికి చెప్పడంతో అతనికి బాగా నచ్చింది. ఈ మూవీకి తొలిసారిగా రిషబ్ శెట్టి డైరెక్షన్ వహించాడు. ఇందులో హీరోగానే కాకుండా రూ.4 కోట్ల పెట్టుబడి కూడా పెట్టాడు రక్షిత్ శెట్టి. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో బాగా డబ్బు వచ్చింది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హీరోగా, డైరెక్టర్ గా టాప్ పొజీషన్లో ఉన్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఈ ఇద్దరు స్నేహితులు ఒకే కంచంలో భోజనం చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.