ఇటీవల సౌత్ సినిమాలకు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతార లాంటి చిత్రాలు ప్రపంచ స్థాయిలో విపరీతమైన క్రేజ్ సంపాదించాయి.. వసూళ్లు కూడా అదే రేంజ్ లో రాబట్టాయి. కాంతార మూవీ చిన్న సినిమాగా రిలీజ్ అయినప్పటికీ బిగ్గెస్ట్ హిట్ సాధించి భారీ వసూళ్లు రాబట్టింది.
గత ఏడాది కన్నడ హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్వియ దర్శకతంలో వచ్చిన ‘కాంతార’ చిన్న చిత్రంగా రిలీజ్ అయ్యింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో కంటెంట్ అందరినీ ఆకట్టుకోవడంతో ఇతర భాషల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో బాక్సాఫీస్ షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా కాంతారకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ‘కాంతార’ చిత్రం ప్రదర్శితం కానుంది. ఈ మూవీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత హీరో, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి ప్రసంగించనున్నారు. ప్రస్తుతం జెనీవాలో పలువురు ప్రముఖులను కలిశారు రిషబ్ శెట్టి. పూర్తి వివరాల్లోకి వెళితే..
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వియ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కాంతార’. చిన్న చిత్రంగా రిలీజ్ అయినప్పటికీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. దాంతో ఈ మూవీ ఇతర భాషల్లో రిలీజ్ చేయగా అక్కడ కూడా ప్రభంజనం సృష్టించింది. కంటెంట్ ఉంటే ఏ భాషా చిత్రాన్నైనా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు. ఇప్పటికే ఈ చిత్రం ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది.. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఈ రోజు మార్చి 17న (శుక్రవారం) నేడు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శిస్తున్న మొట్టమొదటి కన్నడ చిత్రంగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది కాంతార. ఐరాస లో మూవీ స్క్రీనింగ్ అయిన తర్వాత రిషబ్ శెట్టి ప్రసంగించనున్నారు.
ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో.. ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రదర్శితం కావడంపై హీరో రిషబ్ శెట్టి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆయన మీడియా వేధికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘ప్రకృతి ప్రసాదించిన అడవుల పరిరక్షణ గురించి ఈ మూవీలో ప్రస్తావించాం.. దీనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావడం నిజంగా ఎంతో గొప్ప విషయం’ అని పోస్ట్ చేశారు. ఇక కాంతార మూవీ ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం ఏంటీ అనేది తెలియజేస్తుంది. అడవులు, పర్యావరణ పరిరక్షణ, అడవులపై ఆధారపడి జీవించే గిరిజనులు, ఆదివాసీలు.. ఇతర తెగలను ఉద్దేశించి ఐక్యరాజ్య సమితి వేధిగా రిషబ్ శెట్టి ప్రసంగిస్తారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సభ్యులు అందరూ హాజరవుతున్నారు.
కాంతార రిలీజ్ అయిన అన్ని భాషల్లో మంచి క్రేజ్ సంపాదించడంతో ఈ మూవీ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై కాంతార 2 మూవీని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిషబ్ శెట్టి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పనుల్లో ఉన్నారు. కాంతార మూవీ కర్ణాటకలోని భూతకోలా సంస్కృతికి అద్దం పట్టే విధంగా రూపొందించారు. ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులు సరికొత్త అనుభూది పొందారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చే సమ్మర్ లో ఈ మూవీ రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.