స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థత పాలయ్యాడు. షూటింగ్ లో కుప్పకూలిపోయాడు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోకు ఏమైందా అని తెగ టెన్షన్ పడిపోయారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పేరుకే కన్నడ హీరో అయినప్పటికీ.. 90ల్లో తెలుగులోనూ యమ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడంటే అర్జున్ రెడ్డి లాంటి మూవీస్ చూసి ఆహా ఓహో అంటున్నారు. ఇలాంటి సినిమాల్ని అప్పట్లోనే తీసి ఉపేంద్ర తన పవర్ చూపించాడు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రియల్ స్టార్ ఉపేంద్ర అంటే తెలియని వారు ఉండరు. ఈ తరం జనరేషన్ ని ఆయన పెద్దగా తెలీకపోవచ్చు కానీ.. ఒకప్పుడు జస్ట్ ఉపేంద్ర అనే పేరు చూసి సినిమాలకు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం కన్నడకే పరిమితమైన ఆయన.. గురువారం ఓ సినిమా షూటింగ్ కి వెళ్లారు. అయిత సెట్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. శ్వాసకోస సమస్యతో బాధపడటం వల్ల ఊపిరి ఆడకపోవడం వల్లే ఇలా జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే ఇది జరిగిన వెంటనే చిత్రబృందం ఉపేంద్రని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్లు సమాచారం.
కన్నడతో పాటు తెలుగు, తమిళంలో మూవీస్ చేసిన ఊపేంద్ర.. తెలుగులో చివరగా వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలో కనిపించారు. అంతకు ముందు అల్లు అర్జున్ ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం బుద్దిమంత 2, త్రిశూలం, కబ్జా సహా మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కబ్జా.. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే దీని ట్రైలర్ రిలీజ్ కాగా.. అది ‘కేజీఎఫ్’ చిత్రాన్ని గుర్తుచేసేలా ఉంది. కాగా ఉపేంద్ర గతంలో చేసిన ఓంకారం, ఒకేమాట, రా, రక్తకన్నీరు తదితర సినిమాలకు ఇప్పటికీ కల్ట్ ఫాలోయింగ్ ఉండటం విశేషం.
#BreakingNews #Karnataka #Bengaluru
ACTOR UPENDRA HOSPITALISED
Kannada cinema superstar #Upendra was admitted to a Hospital after the actor complained of breathing issues. The incident took place when the actor was on his way to #Bengaluru. pic.twitter.com/QJRz6o82rg
— Kamran (@CitizenKamran) November 24, 2022