తెలుగు ఇండస్ట్రీలో తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరుకు పరిచయం అయ్యింది కాజల్ అగర్వాల్. మొదటి చిత్రంలో అమాయకంగా కనిపించినా..తర్వాత తన అందం..అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాన్,రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి నటించిన రికార్డు ఈ అమ్మడికే దక్కింది.
2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా తన అందచందాలతో అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. ఫోటో షూట్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ లుక్ లో కనిపించిన కాజల్ అగర్వాల్ ని చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.
పెళ్లి తర్వాత కాజల్ అందం రెట్టింపు అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మద్య అమ్మడు తల్లికాబోతుందని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మరి ఆ పుకార్లకి చెక్ పెట్టేందుకే కాజల్ ఇలా వెరైటీ ఫోటో షూట్స్ చేస్తుందా అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది. ఏది ఏమైనా కలువ కళ్ల సుందరి కాజల్ నీ అందాలకు మళ్లీ ఫిదా అంటున్నారు కుర్రాళ్లు.