సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అప్పుడప్పుడు సినిమా సినిమాకి మధ్య దొరికే గ్యాప్ లో ఫ్యామిలీతో వెకేషన్ లకు వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫారెన్ టూర్ లో చిల్ అవుతున్నాడు. ఈ ఏడాది ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ జూలైలో ప్రారంభం కాబోతుంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ విజయాన్ని ఆస్వాదిస్తూ.. తన ఫ్యామిలీతో సింగపూర్ లో ఎంజాయ్ చేస్తున్నాడని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ సింగపూర్ లోని టీఎస్ఎంబీఎస్ మాల్‌లో ఫ్యాన్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూస్తుంటే ఎక్కడకూడా ఎన్టీఆర్ తో ఫ్యామిలీ కనిపించడం లేదు. తన స్నేహితులతో వెళ్ళాడేమోనని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నుండి రాబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కబోతున్నాయి. ఇప్పటికే అనౌన్స్ చేసిన కొరటాల శివ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ 30వ సినిమా రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు స్టార్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. మరి పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ తన స్టార్డమ్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. మరి సింగపూర్ టూర్ కి సంబంధించి ఎన్టీఆర్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
. @tarak9999 in New Avthar From Singapore 🔥🔥
— 𝐍𝐓𝐑 𝐓𝐡𝐞 𝐒𝐭𝐚𝐥𝐰𝐚𝐫𝐭 (@NTRTheStalwart) May 31, 2022
Black is Lub 🖤. @tarak9999 in Singapore 🤩. pic.twitter.com/T4ZdakjPae
— Sai Mohan (NTR ♥️) (@Sai_Mohan_999) May 31, 2022