యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కున్న క్రుజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్స్, యాక్టింగ్ అన్ని సమపాళ్లల్లో కలిసి ఉన్న వ్యక్తి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో జూనియర్‌కు దేశమంతా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. ఇక జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం విడుదల సందర్భంగా అక్కడకు వెళ్లిన జూనియర్‌పై జపాన్ వాసులు ఎంతటి ప్రేమాభిమానులు చూపారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సినిమాల్లో ఎంత క్రేజ్, పాపులారిటీ సాధించుకున్న.. నిజ జీవితంలో మాత్రం ఎంతో ఒదిగి ఉండే మనిషి జూనియర్. మరీ ముఖ్యంగా ఆడవారి పట్ల ఆయన కనబరిచే గౌరవం చూస్తే.. ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఆయన సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు..
కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలకు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రత్యేక అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాజ్యత్సోవ వేడుకల సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం.. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్టాటక రత్న పురస్కారాన్ని అందజేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన రాజ్యోత్సవ వేడుకల్లో ఆ రాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మైతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన సూపర్ స్టార్ రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో.. పునీత్ సతీమణి అశ్వినీకి ఆ పురస్కారాన్ని అందజేశారు. అయితే ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో వర్షం కురవడంతో.. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలు తడిచిపోయాయి.
ఈ క్రమంలో వేదికపై కుర్చీలు తడిచిపోయి ఉండటంతో.. పునీత్ భార్య అశ్విని, సుధామూర్తి వాటిపై కూర్చునేందుకు ఇబ్బందిపడ్డారు. ఇది వెనక నుంచి గమనించిన జూనియర్ ఎన్టీఆర్.. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఉన్న కర్చీప్ తీసుకుని స్వయంగా అశ్విని కూర్చోబోయే కుర్చీని తుడిచారు. అలానే సుధామూర్తి కుర్చీని కూడా శుభ్రం చేయించి ఆమెని తొలుత కూర్చోమని చెప్పారు. చివరికి తాను కూర్చోబోయే కుర్చీని స్వయంగా శుభ్రం చేసుకుని.. ఆ తర్వాత దానిలో కూర్చున్నారు ఎన్టీఆర్.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీని చూసిన వారు.. మహిళలంటే జూనియర్‌కు ఎంత గౌరవమో చూడండి.. ఆయన సింప్లిసిటీకి ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 2021, అక్టోబరు 29న పునీత్ రాజ్‌కుమార్ మరణించారు. పునీత్‌తో జూనియర్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.
His Simplicity 🥺🙏❤️#NTRajiniForAppu #NTRatಕರ್ನಾಟಕರಾಜ್ಯೋತ್ಸವ #NTRForAppu #PuneethRajkumar #DrPuneethRajkumar pic.twitter.com/N8b0R5j3Rr
— Pradeep K (@pradeep_avru) November 1, 2022