Rajasekhar And Jeevitha: సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారంటూ జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. సినిమా నిర్మాణం కోసం తీసుకున్న రూ.26 కోట్లు ఇవ్వటం లేదని ఆరోపించారు. శుక్రవారం జోస్టర్ ఫిలిం సర్వీసెస్ డైరెక్టర్ కోటేశ్వర్ రాజు, ఎండీ హేమ మీడియాతో మాట్లాడుతూ.. గరుడ వేగ సినిమా నిర్మాణం కోసం రాజశేఖర్, జీవితలు వారి ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారని తెలిపారు. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ కోరిక మేరకు ఆస్తులు తాకట్టు పెట్టుకుని రూ. 26 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. అయితే, ఆ ఆస్తులను బినామీల పేరుతో మార్చుకుని తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్, జీవిత దంపతుల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.
జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషని అన్నారు. ఏపీతో పాటు తమిళనాడులోని కోర్టుల్లో ఆ దంపతులపై కేసులు నడుస్తున్నాయని, చెక్ బౌన్స్ కేసులో జీవితపై నగరి కోర్టు నాన్ బేయిలబుల్ వారెంట్ ఇచ్చిందని చెప్పారు. త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడని అన్నారు. రాజశేఖర్, జీవిత దంపతులు తమను మోసం చేశారనడానికి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాగా, 2017లో వచ్చిన పీఎస్వీ గరుడ వేగ సినిమాకు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. రాజశేఖర్, పూజా కుమార్‌లు హీరో,హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరి, రాజశేఖర్, జీవిత దంపతులపై జోస్టర్ ఫిలిం సర్వీసెస్ చేసిన సంచలన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : KGF-2 నటీనటుల రెమ్యూనరేషన్స్ లిస్ట్! యష్ కి ఎంతంటే?