బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ చేసే రచ్చ మాములుగా ఉండదు. అయితే, ఆమె గతంలో సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై నటుడు జేడీ చక్రవర్తి తాజాగా స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు.
యాంకర్ విష్ణు ప్రియ.. బుల్లితెరపై ఈమె ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. పలు టీవీ షోలకు ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇదే కాకుండా అప్పుడప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే, విష్ణుప్రియ గతంలో ఓ టీవీ షోలో పాల్గొని.. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తిని ప్రేమించానని, వాళ్ల అమ్మ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు జేడీ చక్రవర్తి.. విష్ణు ప్రియతో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
జేడి చక్రవర్తి గతంలో ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక తన నటనతో అనేక అవార్డులు సైతం అందుకుని మంచి నటుడిగా గుర్తింపును మూటగట్టుకున్నారు. ఇకపోతే, ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని విష్ణు ప్రియతో పెళ్లి అనే వార్తపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. విష్ణుప్రియ చాలా మంచి అమ్మాయి నేను, విష్ణు ప్రియ కలిసి ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో నటించాం. అది త్వరలో విడుదల కు సిద్ధంగా ఉంది. అయితే, మేము ఈ వెబ్ సిరీస్ కోసం దాదాపు 40 రోజులు కలిసి పని చేశాం. ఈ క్రమంలోనే ఈ సిరీస్ దర్శకుడు పవన్ సాదినేని నేను నటించిన సినిమాలు చూడాలని విష్ణుప్రియకు సూచించాడు. దీంతో ఆమె నా సినిమాలన్నీ చూసి అందులోని పాత్రలతో ప్రేమలో పడ్డారు. అంతేకాని ఆమె నిజంగానే నన్ను ప్రేమించలేదు. ఆమెకు నాకు గురు, శిష్యుల అనుబంధమే తప్పా మరొకటి లేదని క్లారిటీ ఇచ్చారు సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి.