పదహారణాల తెలుగందం.. హీరోయిన్ అంజలి. అందం, అభినయం కలబోసిన ముద్దుగుమ్మ అంజలికి.. తెలుగులో మాత్రం సరైన గుర్తింపు రాలేదనేది వాస్తవం. పుట్టింట్లో కన్నా కూడా పక్క రాష్ట్రాల్లో అంజలికి మంచి పాత్రలు దక్కాయి. అక్కడ ఎంత క్రేజ్ ఉన్నా.. తెలుగులో కూడా రాణించాలనేది అంజలి కోరిక. అందుకే తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే అస్సలు వదులుకోదు. తప్రకుండా ఓకే చేస్తుంది. ఈ క్రమంలో అంజలి లక్కీ చాన్స్ కొట్టిసేంది అనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో అంజలికి అవకాశం లభించినట్లు సమాచారం. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ‘RRR’ కొమ్మా ఉయ్యాల పాటను లైవ్ లో పాడి అలరించిన ప్రకృతి రెడ్డి
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్-తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో RC15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే RRR సినిమాతో భారీ సక్సెస్‌ను అందుకున్న రామ్ చరణ్.. నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా డైరెక్టర్ శంకర్ సినిమా చేస్తుండటంతో.. దీనిపై కూడా భారీ అంచానలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి తరచుగా ఏదో ఒక అప్‌డేట్ బయటకు వస్తూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా రెండు షేడ్స్ లో నటించనున్నట్టు వార్త వెలువడగా.. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తెరపై మరో కథానాయిక పేరు వినిపిస్తోంది. ఆమె తెలుగు అమ్మాయి అంజలి. తను కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ న్యూ లుక్.. ఫోటో లీక్!సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకుల పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంజలి.. సీనియర్ రామ్ చరణ్‌తో జత కట్టనున్నట్లు సమాచారం. ఇక జూనియర్ రామ్ చరణ్‌కి జోడిగా కియారా అద్వాని కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇంటీవల రాజమండ్రిలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ బ్రేక్ ఇవ్వగా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుందట. అయితే ఈ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్, హైదరాబాద్‌లో జరగనుందని సమాచారం. ఈ వార్తలపై చిత్ర బృందం నుంచి కానీ.. అంజలి నుంచి ఎలాంటి అధికారక సమాచారం వెలువడలేదు. దీనిపై అంజలి ఎలా స్పందిస్తుందో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Jr.ఎన్టీఆర్- రామ్ చరణ్ క్రేజ్ గురించి హాలీవుడ్ హీరో మాటల్లో
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.