ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన స్టైల్, లుక్, మేనరిజం, నడక.. ఇలా రజినీ ఏం చేసినా థియేటర్స్ లో ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ పండగ చేసుకోవడం ఖాయం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కేవలం రజినీ మేనరిజం, స్టైల్ కారణంగా ఆడిన సినిమాలే చాలా ఉన్నాయి. అలా రజినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలలో ‘బాషా’ ఒకటి. 1995లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీలో రజినికి ఉన్న క్రేజ్ ని అమాంతం పెంచేసింది. తమిళ, తెలుగు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించిన సినిమా బాషా.
ఈ సినిమాలో అన్ని మేజర్ హైలెట్సే. రజినీ లుక్, డైలాగ్స్, సాంగ్స్.. ఫైట్స్ ఇలా అన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. బాషా అంటే రజినీకాంత్ తప్ప ఇంకెవరినీ ఉహించుకోలేని విధంగా ఆ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ మరోసారి తెరమీదకు వస్తుందని తెలిస్తే.. ఫ్యాన్స్ లో ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అవును.. కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్ధన్.. బాషా సినిమాని రీమేక్ చేసే పనిలో ఉన్నాడట. కానీ.. ఇక్కడ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని నిరాశపరిచే వార్త కూడా ఉందట. కొత్తగా రీమేక్ చేయబోతున్న బాషా సినిమాలో హీరోగా సూపర్ స్టార్ ఉండరట. ఏంటి రజిని లేకుండా బాషా సినిమానా? అని షాక్ అవ్వచ్చు.
అదే నిజమని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. సూపర్ స్టార్ రజిని నటించిన బాషా.. సినిమాని డైరెక్టర్ విష్ణువర్ధన్ హీరో అజిత్ తో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో రజినీ నటించిన ‘బిల్లా’ సినిమాని.. అదే టైటిల్ తో అజిత్ హీరోగా తీసి హిట్ కొట్టాడు విష్ణువర్ధన్. ఇప్పుడు మరోసారి రజినీ బాషా సినిమాని అజిత్ తో రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒరిజినల్ బాషా మూవీని డైరెక్టర్ సురేష్ కృష్ణ తెరకెక్కించారు. మరి రీమేక్ అంటున్న మూవీలో రజినీ మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీని అజిత్ తో ఎలా చూపించనున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అజిత్.. విగ్నేష్ శివన్ తో తన 62వ సినిమా చేయనున్నాడు. మరి బాషా రీమేక్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి! బాషాని రీమేక్ చేస్తే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.
#Baasha; none can replace it or remake it. #Baasha of the Kollywood Industry signifies Brutal domination; such level of domination >>> 3-4 times higher than business rivals is never gonna happen in future. #27YearsOfBaasha pic.twitter.com/0ZtoUMcQ6s
— Chris (Limited Edition) (@peacebroxyz) January 12, 2022