ఓటిటి సినిమాల ట్రెండ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటి సినిమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయారు. అయితే.. ఓటిటి సినిమాలు ఒక్కోసారి కేవలం ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ఒకేసారి అన్ని భాషలలో స్ట్రీమింగ్ చేస్తుంటారు. తాజాగా ఇరాట్ట సినిమా.. మిగతా భాషల ఆడియెన్స్ అటెన్షన్ కూడా సంపాదించుకుంది.
ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాల ట్రెండ్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటి సినిమాలకు ఎక్కువగా అలవాటు పడిపోయారు. అయితే.. ఓటిటి సినిమాలు ఒక్కోసారి కేవలం ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ఒకేసారి అన్ని భాషలలో స్ట్రీమింగ్ చేస్తుంటారు. కానీ.. ఇటీవల ఒరిజినల్ భాషలో విడుదలై.. సంచలనం సృష్టించిన ఓ సినిమా.. మిగతా భాషల ఆడియెన్స్ అటెన్షన్ కూడా సంపాదించుకుంది. దీంతో ఓటిటిలో బ్లాక్ బస్టర్ అయిన ఆ సినిమాని మిగతా భాషల్లోకి కూడా అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ సినిమా తెలుగులో అందుబాటులోకి వచ్చింది .
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఇరాట్ట’ మూవీ గురించి విని ఉంటారు. మార్చి 3న ఓటిటిలో రిలీజైన ఈ సినిమాని భాషతో సంబంధం లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. దాంతో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రిక్వెస్టులు వినిపించాయి. అదీగాక ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్ కాబట్టి.. తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్ నడిచింది. కానీ.. ఆ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటిటి.. రీమేక్ వార్తలకు చెక్ పెట్టి.. తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదంతా ఇప్పుడు తెలుగు ఓటిటి ఆడియెన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గా మారింది.
ఇంతకీ ఇరాట్ట సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేగా మీ సందేహం. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాలో జోజూ జార్జ్, అంజలి, మనోజ్ కె.యు ఆర్యన్ సలీమ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని దర్శకుడు రోహిత్ ఎంజి కృష్ణన్ తెరకెక్కించారు. అయితే.. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఇరాట్ట మూవీ కథ.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. మరి ఇన్ని రోజులు తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేయొచ్చు. మరి ఓటిటిలో ఇరాట్ట మూవీని వీక్షించి.. ఆ సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Iratta now also streaming in Tamil & Telugu Audios as well
…#IrattaOnNetflix pic.twitter.com/JyGZuQ0ljD— Celer Updates (@celerottupdates) March 12, 2023