ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అంటే.. రెండు దేశాల్లో.. యుద్ధం సమయంలో ఎంత ఉత్కంఠభరితంగా ఉంటుందో.. సేమ్ అలాంటి పరిస్థితులే కనిపిస్తాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఈ రెండు దేశాల మధ్యనే కాక.. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆదివారం ఇండియా-పాక్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా ఇవే పరిస్థితులు కనిపించాయి. ఇక నరాలు తెగేంత ఉత్కంఠబరితంగా సాగిన.. ఈ మ్యాచ్‌లో పాక్‌పై ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం వెనక విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు.
భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీని ఉద్దేశించి.. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కోహ్లీ సాధించిన విజయంపై ఆయన భార్య అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించింది. నా జీవితంలోనే అద్భుతమైన మ్యాచ్ చూశానంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఆ వివరాలు..
మ్యాచ్ అనంతరం గ్రౌండ్లో చోటు చేసుకున్న సన్నివేశాలను టీవీలో చూస్తూ.. కెమారాలో బంధించింది అనుష్క శర్మ. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భర్తపై తన ప్రేమను చాటుకుంది అనుష్క. ‘‘నువ్వొక అద్భుతం. అత్యుత్తమైన ప్రదర్శనతో.. దీపావళి పండుగ కన్నా ముందే అభిమానుల్లో సంతోషాన్ని నింపావు. కఠినమైన నీ సాధన, బలమైన సంకల్పం, నమ్మకం సడలని నీ దృఢచిత్తం అద్భుతం. నా జీవితంలో చూసిన అత్యుత్తమైన మ్యాచ్‌ల్లో ఇదొకటి’’ అని రాసుకొచ్చింది.
అంతేకాక ‘‘మ్యాచ్ ముగిశాక ఆనందం పట్టలేక నేను డ్యాన్స్ చేశాను. అయితే నేను ఎందుకు అలా డ్యాన్స్ చేశానో అర్థం కాక.. నా కుమార్తె ఇళ్లంతా తిరిగింది. కానీ ఏదో ఒక రోజు.. తన తండ్రి ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ గురించి తను తెలుసుకుంటుంది. నీ కెరీర్లో అత్యంత కష్టమైన దశను దాటి.. మరింత బలంగా తిరిగివచ్చిన నిన్ను చూస్తే.. నాకేంతో గర్వంగా ఉంది. నీపై నా ప్రేమ అపరిమితం..’’ అంటూ భర్తను ఉద్దేశించి భావోద్వేగభరితమైన సందేశాన్ని పోస్ట్ చేసింది అనుష్క. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
ఇక భార్య పోస్ట్‌పై విరాట్ కోహ్లీ స్పందించాడు. ‘‘థ్యాంక్యూ మై లవ్.. జీవితంలో ప్రతి వేళా, ప్రతి విషయంలో నాకు మద్దతుగా నిలిచావు. దాన్ని నేనేంతో గొప్పగా భావించాను. లవ్ యూ సో మచ్’’ అంటూ రిప్లై ఇచ్చాడు కోహ్లీ. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ అతడిని ఎత్తుకుని మోశాడు. కోహ్లీపై ప్రశంసల జల్లు కొనసాగుతోంది.