Vishwak Sen: సెల్ఫ్ మేడ్ మ్యాన్ విశ్వక్ సేన్ నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ వివాదాల నడుమే శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అన్నారు. ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్లా కాకుండా 30 ఏళ్లు దాటే లోపే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. లోక నాయకుడు కమల్‌హాసన్ నటించిన ‘భామనే సత్యభామనే’ లాంటి సినిమా చేయాలని ఉందని, ఆ సినిమాలో చేసిన ఫీమేల్ క్యారెక్టర్ లాంటివి చేయడానికి తాను సిద్ధమేనని అన్నారు. తాను కేవలం తెలంగాణ హీరోగా మాత్రమే ఉండాలనుకోవడం లేదని, ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తానని వెల్లడించారు. హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ‘‘ఫలక్‌నుమా దాస్’’ సీక్వెల్‌ను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రమోషన్ కోసం చాలా చేశాం.. కానీ, ప్రాంక్ వీడియో వివాదమే కనిపిస్తోంది!
ఫ్రాంక్ వీడియో వివాదంపై కూడా ఆయన స్పందించారు. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమా ప్రమోషన్ కోసం చాలా చేశామని, కానీ, ప్రాంక్ వీడియో వివాదమే అందరికీ కనిపిస్తోందని అన్నారు. ప్రాంక్ వీడియో వివాదం పక్కకు వెళ్లిపోయిందని అన్నారు. ఇకపై అలాంటి తరహా ప్రయోగాలు చేయనని స్పష్టం చేశారు. కాగా, విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’ సినిమాకు విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. మరి, ప్రాంక్ వీడియోల జోలికి పోనంటున్న విశ్వక్ సేన్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Devi Nagavalli: 2 రోజులు తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చున్నాను: దేవి నాగవల్లి