టాలీవుడ్ లో ఎలాంటి జోనర్ సినిమాలకైనా న్యాయం చేయగలిగే హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యామిలీ డ్రామా, మాస్, కమర్షియల్, థ్రిల్లర్, కాప్.. ఇలా అన్ని జానర్స్ లో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇండస్ట్రీలో హీరోగా దాదాపు 35 ఏళ్లకు పైగా కొనసాగుతున్న వెంకీ.. కెరీర్ లో అత్యధిక హిట్స్ అందుకున్న హీరోగా పేరొందారు. ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలు పోషించి.. అశేష ప్రేక్షకాదరణ, అసంఖ్యాకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. కొన్నాళ్లుగా సాదాసీదా కథలతో.. ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ సేఫ్ జోన్ లో వెళ్ళిపోతున్నాడు వెంకీ. కానీ.. ఫ్యాన్స్ అంతా వెంకటేష్ ని మరోసారి ఫుల్ ఆన్ యాక్షన్ తో.. ఘర్షణ లాంటి సినిమాలో చూడాలని అనుకుంటున్నారు.
గతంలో వెంకీ చేసిన ధర్మచక్రం, గణేష్, ఘర్షణ, లక్ష్మీ, తులసి లాంటి ఎన్నో యాక్షన్ సినిమాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఓ రకంగా వెంకీకి ఘర్షణ సినిమాలో చేసిన డీసీపీ రామచంద్ర క్యారెక్టర్స్ బాగా సూట్ అవుతాయని.. ఆయన మళ్లీ అలాంటి పవర్ ఫుల్ కాప్ క్యారెక్టర్ తో సినిమా చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో హిట్, హిట్ 2 సినిమాలతో హిట్స్ కొట్టిన డైరెక్టర్ శైలేష్ కొలనుతో ఓ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు క్రైమ్ – కాప్ రిలేటెడ్ స్టోరీస్. అదీగాక.. ఈ రెండు సినిమాలలో పోలీస్ క్యారెక్టర్స్ ని చాలా వినూత్నంగా డిజైన్ చేసి చూపించాడు శైలేష్.
ఈ క్రమంలో ఇప్పుడు వెంకటేష్ తో చేయబోయే సినిమా కూడా పోలీస్ స్టోరీతోనే రాబోతుందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. అయితే.. ఇంకా అనౌన్స్ కాని సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని ఇంటరెస్టింగ్ కథనాలు వినిపిస్తున్నాయి. ఫలితం గురించి పక్కన పెడితే.. వెంకీతో గౌతమ్ మీనన్ తీసిన ఘర్షణ సినిమాకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. డీసీపీ రామచంద్ర క్యారెక్టర్ లో ఫుల్ ఆన్ యాక్షన్ తో జనాలను బాగా ఆ;అలరించారు. కానీ, ఎందుకోగానీ.. ఘర్షణ తర్వాత నుండి కాప్ స్టోరీస్ తో ప్రయోగాత్మక సినిమాలు చేయడం మానేశారు వెంకీ.
ఇదిలా ఉండగా.. డైరెక్టర్ శైలేష్ కొలనుతో సినిమా అనేసరికి ఘర్షణ లాంటి పవర్ ఫుల్ పోలీస్ యాక్షన్ సినిమాని ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ సినిమా ఎలాంటి కథతో తెరకెక్కనుందో తెలియదు. కానీ, వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా రానుందట. నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మించనున్నారని సమాచారం. కాగా.. ఈ సినిమా కోసం టాప్ మోస్ట్ పాపులర్ టెక్నీషియన్స్ ని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అదీగాక ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా.. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నాయని టాక్. చూడాలి మరి వెంకీతో శైలేష్.. ఘర్షణ లాంటి హై ఫీలింగ్ కలిగిస్తాడేమో! మరి వెంకీ – శైలేష్ ల కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Buzz Is That A Film In the combination of Victory #Venkatesh and #SaileshKolanu is confirmed and this is going to be the landmark 75th film of Venky
But if it happens,will it be a Part of #Hit Universe or a Seperate Film!
What’s your thoughts if @VenkyMama acts in hit Universe?
— Daily Culture (@DailyCultureYT) December 22, 2022