ఆదివారం నాడు చెన్నై వేదికగా ఆదాయపన్ను అధికారులు ఇన్‌కమ్ ట్యాక్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో అత్యధిక పన్ను చెల్లించిన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేశారు. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆ గౌరవం దక్కింది.
తమిళనాడు నుంచి అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తిగా రజినీకాంత్ నిలిచారు. ఆయన తరఫున కుమార్తె ఐశ్వర్య ఐటీ అధికారులు ప్రకటించిన అవార్డును అందుకున్నారు. దక్షిణాది నుంచి అత్యధిక పారితోషకం అందుకునే హీరోల్లో రజినీకాంత్ అగ్రస్థానంలో ఉంటారని అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ క్రమం తప్పుకుండా పన్ను చెల్లిస్తారని చెబుతుండేవారు. ఇప్పుడు ఐటీ అధికారులు ఇచ్చిన అవార్డుతో అది నిజమని రుజువైంది.
ఐటీ అధికారులకు రజినీకాంత్ తరఫున ఐశ్వర్య కృతజ్ఞతలు తెలిపింది. ఆయన కుమార్తె అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నట్లు వ్యాఖ్యానించింది. రజినీకాంత్ ఒక్కో సినిమాకి రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సినీ వర్గాల్లో టాక్ ఉంది. ఆయన ఎంత సంపాదించిన ఎంతో సింపుల్‌గా సాధారణ వ్యక్తిగా జీవిస్తుంటారు. అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తుంటారు. ఎప్పుడూ తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటారు.
ఇంక దేశవ్యాప్తంగా అత్యధిక పన్ను చెల్లించిన నటుడిగా అక్షయ్ కుమార్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ లో అక్షయ్ ఎంతో వేగంగా సినిమాలు నిర్మిస్తూ ఉంటాడు. ఏడాదిలో 4 సినిమాలు కూడా విడుదల చేసి ఆశ్యర్య పరుస్తూ ఉంటాడు. అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకి రూ.80 నుంచి రూ.100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది.
సినిమాలు మాత్రమే కాకుండా అక్షయ్ పలు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తుంటాడు. యాడ్స్ కోసం కూడా కోట్లలోనే పారితోషకం అందుకుంటాడని తెలుస్తోంది. అయితే అక్షయ్ కుమార్ కూడా ఎప్పుడూ క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ ఉంటారని చెబుతున్నారు. రజినీకాంత్, అక్షయ్ కుమార్‌కు అవార్డులు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
On occasion of Income Tax Day, Pr.CCIT, Mumbai felicitated Income Tax payers Akshay Kumar Bhatia (Accepted by a representative) and Naresh Mulchand Jain for their commitment towards payment of Income Tax and contribution to the National exchequer.@IncomeTaxIndia #IncomeTaxDay pic.twitter.com/gkKemJKvsY
— IncomeTaxMumbai (@mumbai_tax) July 24, 2022