సినీ సెలబ్రిటీల గురించి ఓ వార్త వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన విషయాల గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా ప్రముఖ తమిళ స్టార్ హీరో విశాల్ కడప వెళ్లారు. ఈ క్రమంలో విశాల్ కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. విశాల్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. తాను గతంలో కడప వచ్చినప్పడు.. దర్గాను దర్శించుకోవడానికి కుదరలేదు. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్ధనలు చేయడానికే వచ్చానని విశాల్ చెప్పారు.
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. తమిళ్ లో తాను తీసే సినిమాలని తెలుగులోనూ విడుదల చేస్తుంటాడు. తెలుగులో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాందించాడు. ప్రస్తుతం లాఠీ అనే సినిమాలో నటిస్తోన్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈక్రమంలో తాజాగా విశాల్ కడప లోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. అమీన్ పీర్ దర్గాకు వచ్చిన ఆయన ప్రత్యేక ప్రార్ధను చేశారు. దర్గాలో పూలచాదర్ ను సమర్పించాడు. అక్కడి మత పెద్దలు అమీన్ పీర్ దర్గా గొప్పతనాని హీరో విశాల్ కు తెలియజేశారు. గతంలో సినిమా షూటింగ్ కోసం తాను కడప వచ్చిన సందర్భంలో పెద్ద దర్గాను దర్శించుకోలేకపోయానని, ఇప్పుడు దర్శించుకునే భాగ్యం దొరికిందని తెలిపారు.
తొలిసారి పెద్ద దర్గాను దర్శించుకుని ఆత్మసంతృప్తి పొందానని తెలిపారు. కడపకు వచ్చిన ప్రతిసారి ఏదో తెలియన శక్తి, ధైర్యం వస్తుందని, ఆత్మశాంతి కల్గుతుందన్నారు. ఇక విలేకర్లు అడిన పలు ప్రశ్నలు సమాధానం చెప్పాడు. తాను ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నానన్నారు. దీపావళి పండగకు పటాసులు కాల్చడం కోసం ఉపయోగించే డబ్బులతో పేదలకు సాయం చేయడం మంచిదని అభిమానులకు, సినీ ప్రియులకు విశాల్ విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందని తెలిపారు.