సినీ ఇండస్ట్రీలో ముప్పైయేళ్లు వయసు పైబడిన హీరోయిన్స్ చాలానే ఉన్నారూ. నిన్నమొన్న వచ్చిన హీరోయిన్లు.. ఒకటి రెండు సినిమాలకే బాయ్ ఫ్రెండు, లవ్వు, పెళ్లంటూ సర్ప్రైజ్ చేస్తుంటారు. కానీ.. ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్న హీరోయిన్స్.. లవ్, పెళ్లిపై ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ చెబుతారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్లలో యాపిల్ బ్యూటీ హన్సిక ఒకరు. దేశముదురు సినిమాతో టీనేజ్ లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై భామ.. దాదాపు తెలుగులో అందరి స్టార్స్ సరసన సినిమాలు చేసింది. ఇటీవల మహా మూవీతో కెరీర్ లో 50 సినిమాలు పూర్తి చేసుకుంది హన్సిక.
మొదటినుండి హన్సిక సినిమాలు, స్వచ్చంధ సేవలు బాగానే చేస్తోంది.. తమిళనాడులో అభిమానులు హన్సికకి ఏకంగా గుడి కట్టిన సంగతి తెలిసిందే. అయితే.. హన్సిక లైఫ్ లో లవ్, బ్రేకప్స్ ఉన్నాయని వార్తలతో పాటు త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే వార్త కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హన్సిక చడీచప్పుడు లేకుండా డిసెంబర్ లో పెళ్లికి సిద్ధమైపోయిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు అమ్మడి పెళ్లి ఖాయమేనని.. పెళ్లి కూడా రాచకోటలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకీ పెళ్లి ఎక్కడో తెలుసా.. జైపూర్ లో ఉన్న ముండోట ప్యాలస్ వేదికగా హన్సిక పెళ్లి గ్రాండ్ గా జరగనుందని సమాచారం.
ఈ నేపథ్యంలో పెళ్లి కోసం 450 ఏళ్ళ క్రితం నాటి పురాతన ప్యాలస్ లో అన్ని గదులను ముందే బుక్ చేసేశారని టాక్. పెళ్లి వేదిక, అతిథులకు విడిది ఇలా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్ మీడియా చెప్పుకొచ్చింది. అయితే.. పెళ్లి కొడుకు ఎవరు అనేది తెలియలేదు. కానీ.. తాను ప్రేమించిన అబ్బాయినే హన్సిక పెళ్లి చేసుకోబోతుందట యాపిల్ బ్యూటీ. ఇక గతంలో లావుగా, బొద్దుగా ఉంటూ సినిమాలు చేసిన హన్సిక.. ఈ మధ్య బాగా సన్నబడి నాజూకుగా తయారైంది. అప్పటినుండి గ్లామర్ డోస్ పెంచేసి ఏకంగా బికినీలో ఫోటోషూట్స్ చేస్తూ సర్ప్రైజ్ చేసింది. మరి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హన్సిక.. పెళ్లి చేసుకోబోతుందంటే ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి.. హన్సిక తన పెళ్లిపై క్లారిటీ ఎప్పుడు ఇవ్వనుందో!