ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందిన జూ. ఎన్టీఆర్ మరో సరికొత్త సినిమాలో రానున్నారు. గ్లోబల్ బ్యూటీతో మన ముందుకు రానున్న సినిమా షూటింగ్ నెక్ట్స్ ఇయర్ స్టార్ట్ కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ వరుస షూటింగ్‌లతో బిజీ అయ్యాడు. నాటునాటు పాటతో ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన గ్లోబల్ యంగ్ హీరో ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకున్నాడు. ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు కూడా సినిమాలు తీయడానికి రెడీ అవుతున్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటేనే అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ట్రిపుల్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన మన యంగ్ టైగర్ కి మరింత క్రేజ్ పెరిగింది. ట్రిపుల్ఆర్ మూవీ ఆస్కార్ పొందిన తర్వాత నిర్మాతలు, దర్శకులు హీరో, హీరోయిన్‌లను ఎన్నుకోవడంలో చాలా కేర్‌ఫుల్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం రానున్న ప్రశాంత్ సినిమా కోసం హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకోనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రియాంక చోప్రాకు ఇంటర్నేషనల్ లెవల్‌గా మంచి గుర్తింపు ఉంది. హాలీవుడ్ సినిమా ఛాన్సెస్ చాలా అందిపుచ్చుకుంటుంది. తన ప్రతిభతో అందరిని అబ్బురపరుస్తుంది. ప్రియాంక చేసిన సీటీడెల్ వెబ్ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. అందుకుగాను ఇంటర్నేషనల్ గుర్తింపుతో ఉన్న ప్రియాంకను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నారు. జూ.ఎన్టీఆర్, ప్రియాంక చోప్రా జోడీలో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మెరిసిపోతున్న ఎన్టీఆర్‌కు జోడీగా ప్రియాంకతో సినిమా అద్భుతంగా ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో ‘దేవర’ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని సరికొత్త రీతిలో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా ఇండియా-పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే కథగా ఆడియన్స్ ముందుకు రానుంది. జూనియర్ 31వ ప్రాజెక్ట్‌గా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తున్నాయి. తాజాగా వచ్చిన అప్ డేట్ ప్రేక్షకులందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రాను సెలెక్ట్ చేశారని సినీ పరిశ్రమలో టాక్ వస్తుంది. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రియాంకతో కాంటాక్ట్ అయినట్లు కూడా వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. నెక్ట్స్ ఇయర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూ.ఎన్టీఆర్, ప్రియాంక చోప్రాల కాంబినేషన్‌లో వచ్చే సినిమాపై మీ కామెంట్స్ తెలియజేయండి.