ఒకరేమో వ్యాపార వ్యవహరాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే పర్సనాలిటీ కాగా.. మరొకరు షూటింగ్‌లతో ఏమాత్రం తీరిక దొరకని షెడ్యూల్‌తో బిజీ. వారే ఆనంద్ మహీంద్రా, రామ్ చరణ్.. నిత్యం బిజీగా ఉండే వీరిద్దరూ తాజాగా ఓ వేదిక మీద కలిశారు.. ఎక్కడంటే..
ప్రముఖ వ్యాపారవేత్త, ఆటోమొబైల్ దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో టాప్ సెలబ్రిటీలను మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ట్విట్టర్‌లో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వినూత్న ఆవిష్కరణలతో పాటు.. విభిన్నమైన అంశాల గురించి పోస్ట్ చేస్తుంటాడు ఆనంద్ మహీంద్రా. ఆయన పోస్ట్‌లు తెగ వైరలవుతుంటాయి. ఈ క్రమంలో తాజాగా ఆనంద్ మహీంద్రా ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో ఆనంద్ మహీంద్రాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండటంతో ఇది తెగ వైరలవుతోంది. ఇంతకు వీరిద్దరూ ఎక్కడ కలిశారు.. దేనికోసం కలిశారు అంటే..
హైదరాబాద్‌లో తొలి సారి ఈ-రేస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. శనివారం ఈ రేస్ ప్రారంభం అవుతుంది. ఐటీ మినిస్టర్ కేటీఆర్ చొరవతో.. హైదరాబాద్‌లో తొలి సారి ఈ ఈ-రేస్ జరగనుంది. దీనిలో ఆనంద్ మహీంద్రా గ్రూప్ కూడా పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్.. ఆనంద్ మహీంద్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఫార్ములా-ఈ రేసింగ్‌లో పాల్గొనే తమ జనరేషన్-3 ఫార్ములా-ఈ రేస్ కారును గురువారం రాత్రి మహీంద్రా గ్రూప్ ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో పాటు కేటీఆర్, హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ కాసేపు ముచ్చటించారు. ఇక వీరిద్దరూ కలిసి దిగిన ఈ ఫొటోలను రామ్ చరణ్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇవి వైరలవుతున్నాయి. ఫోటోలు షేర్ చేయడంతో పాటు ఆనంద్ మహీంద్రాను, సీపీ గుర్నానీని కలుసుకోవడం అద్భుతంగా ఉందని పోస్ట్ చేశారు రామ్ చరణ్. ఫార్ములా-ఈ రేసింగ్‌లో విజయం సాధించాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మన నగరానికి ఇలాంటి కార్యక్రమాలను తీసుకురావడానికి ఎంతో చొరవ చూపిస్తోన్న మంత్రి కేటీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు రామ్ చరణ్. ఇక ఈ ఫోటోలో రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించి ఉన్నారు. మరి నగరంలో ఇలాంటి రేసులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
It was wonderful meeting @anandmahindra Ji & @C_P_Gurnani Ji at @MahindraRacing
Wishing them great success at the Formula E racing!
Thank you @KTRBRS Garu for bringing such amazing initiatives to our city.#CheerForTeamMahindra @GreenkoIndia #HyderabadEPrix pic.twitter.com/yKOqpuJ6z5
— Ram Charan (@AlwaysRamCharan) February 10, 2023
Minister @KTRBRS attended @MahindraRise‘s Gen3 Formula E race car homecoming celebrations.
Chairman of Mahindra Group, @anandmahindra, Exec Dir, Auto and Farm Sectors, @rajesh664, MD & CEO of @tech_mahindra, @C_P_Gurnani, Actor @AlwaysRamCharan were present on the occasion. pic.twitter.com/JIJDweitYH
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 10, 2023