ఒక్క సినిమాతో తమ ఇమేజ్‌ను పాన్ ఇండియాతో పాటు పాన్ వరల్డ్ స్థాయికి పెంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ సక్సెస్ సాధించడంతో వీరిద్దరి పేర్లూ మారుమోగిపోతున్నాయి. ఈ సినిమాలో తమదైన నటనతో చరణ్, తారక్ ప్రేక్షకుల హృదయాలను గెల్చుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ బరిలో నిలిచిన విషయం విదితమే. ఇక, ఈ సినిమా తర్వాత చరణ్ తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో మూవీ చేస్తున్నాడు. దీని షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చిందని సమాచారం. దీంతో మిగిలిన ప్రాజెక్టులపై చెర్రీ ఫోకస్ పెడుతున్నాడని టాక్. కాగా, ఎన్టీఆర్ మాత్రం ఇంకా కొత్త సినిమాను ప్రారంభించలేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై దాదాపుగా ఏడాది కావొస్తున్నప్పటికీ తారక్ కొత్త చిత్రం ఇంకా మొదలవ్వలేదు.
జూనియర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ చేయాల్సిన సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. పలు కారణాలతో ఆ మూవీ చిత్రీకరణ స్టార్ట్ కాలేదని సమాచారం. త్వరలో ఈ ఫిల్మ్ రెగ్యులర్ షూట్ మొదలవుతుందని అంటున్నారు. ఇదిలాఉండగా.. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌తో తారక్ చిత్రంపై చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ‘అసురన్’ లాంటి సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్న వెట్రిమారన్.. తారక్‌తో సినిమా తీస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు అంటున్నారు. మట్టి కథలకు కమర్షియాలిటీ టచ్ ఇచ్చి సినిమాలు తీసే వెట్రిమారన్ జాతీయ అవార్డును కూడా అందుకోవడం విశేషం. అలాంటి దర్శకుడైతేనే తమ హీరోలోని అసలైన నటనను వెలికితీస్తాడని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడీ కాంబోపై మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఇటీవల తారక్‌ను వెట్రిమారన్ కలిసి.. ఆయనకు మూడు కథలు వినిపించారట. అందులో ఓ స్టోరీకి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ స్టోరీని రెండు భాగాలుగా తీయనున్నారని సమాచారం. మొదటి పార్ట్‌లో తారక్ హీరోగా నటిస్తారని.. సీక్వెల్‌లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లీడ్ రోల్‌లో యాక్ట్ చేస్తారని సోషల్ మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలతో బంపర్ హిట్స్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తారక్-వెట్రిమారన్ మూవీని నిర్మించనుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే వీటిపై ఇటు తారక్, ధనుష్ నుంచి గానీ.. అటు వెట్రిమారన్, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి గానీ అధికారిక ప్రకటన రాలేదు. అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే గానీ దీనిపై క్లారిటీ రాదు. ఈ క్రేజీ కాంబోలో సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి. మరి.. ఎన్టీఆర్-వెట్రిమారన్ మూవీ కోసం మీరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#NTR – #Dhanush – #VetriMaaran pic.twitter.com/Pi07K2TvSy
— Fukkard (@Fukkard) February 5, 2023